Share News

గంధం చెట్లు నరికిన ముగ్గురు మధ్యప్రదేశ్‌ వాసుల అరెస్ట్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:47 AM

రాజానగరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరాడలోని ఒక తోటలో గంధం చెట్లు నరి కిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సో మవారం రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్య గౌడ్‌ నిందితుల వివరాలను వెల్లడిం చారు. హైదరాబాద్‌కు చెందిన తన్నీరు విజయ కుమార్‌కు రాజానగరం మండలం నందరాడ గ్రామంలో 12 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం లో

గంధం చెట్లు నరికిన ముగ్గురు మధ్యప్రదేశ్‌ వాసుల అరెస్ట్‌
రాజానగరం పోలీస్‌ స్టేషన్‌లో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌

రూ.10,25,000 విలువైన చెట్టు మానులు స్వాధీనం

రాజానగరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరాడలోని ఒక తోటలో గంధం చెట్లు నరి కిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సో మవారం రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్య గౌడ్‌ నిందితుల వివరాలను వెల్లడిం చారు. హైదరాబాద్‌కు చెందిన తన్నీరు విజయ కుమార్‌కు రాజానగరం మండలం నందరాడ గ్రామంలో 12 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం లో కొబ్బరి, మామిడి, టేకు, ఎర్ర చందనం, శ్రీ గంధం చెట్లను పెంచుతున్నారు. సదరు తోటలో దొడ్డా సోమేశ్వరరావు సూపర్‌వైజర్‌గా పనిచేస్తు న్నాడు. ఈనెల 16న సోమేశ్వరరావు పొలం ప నులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లి పోయాడు. 19న ఉదయం తోటమాలి పిన్నమ రాజు సత్యనారాయణ తోటలోకి వెళ్లి చూడగా తోటలో ఉన్న 2 గంధపు చెట్లను ఎవరో నరికి తీసుకెళ్లడం గమనించి సోమేశ్వరరావుకు ఫోన్‌ లో సమాచారం అందించాడు. దీంతో సోమేశ్వరరావు తోటలోకి వెళ్లి చూడగా గంధం చెట్టు నరికేసి అపహరించినట్లుగా గుర్తించి పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. గంధం చెట్లను మొద లకు కోసి చెట్టు చివరి భాగం వదిలిపెట్టి మొద లు భాగాన్ని ముక్కలుగా నరికి దొంగిలించారు. ఈ మేరకు సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్య గౌడ్‌ పర్య వేక్షణలో ఎస్‌.ఐ ప్రియకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌ నుంచి వ చ్చి సంచార జీవనం చేస్తున్న వ్యక్తులను అను మానితులుగా గుర్తించి ఈ నెల 21న దివాన్‌ చెరువు సమీపంలో పట్టుకుని విచారించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కట్ని జిల్లాకు చెందిన జాలిస్‌ ఆదివాస్‌, శివరాజ్‌ ఆదివాసీ, ఉల్లిష్‌ అలియాస్‌ టీటూ అనే ముగ్గురుని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి గంధం చెట్ల మాను ముక్కలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.10,25,000 ఉంటుందన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:47 AM