Share News

అ‘క్రమ’ పరుగులు!

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:56 AM

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి అంచనాలకు మించిన స్పందన వ్యక్త మవుతోంది.

అ‘క్రమ’ పరుగులు!

ఎల్‌ఆర్‌ఎస్‌కు 15598 దరఖాస్తులు

ప్రభుత్వానికి రూ.127 కోట్ల రాబడి

గత వైసీపీలో భారీగా అక్రమ లేఅవుట్లు

చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు

కూటమి అధ్యయనం ..లబ్ధిదారులకు ఛాన్స్‌

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి అంచనాలకు మించిన స్పందన వ్యక్త మవుతోంది. అనధికార లేఅవుట్ల క్రమ బద్ధీకర ణకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నా యి. ఇప్పటి వరకు 15,598 దరఖాస్తులు పోటెత్తాయి. దీన్ని బట్టి గత వైసీపీ సర్కారు హయాంలో ఏ స్థాయిలో అక్రమ లేఅవుట్లు పురుడు పోసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క వచ్చిన ఎల్‌ఎఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.127 కోట్ల వరకు రాబ డి రానుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 7,390 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రావ డం విశేషం. వచ్చే నెల వరకు గడువు ఉండ డంతో వీటి సంఖ్య మరింత పెరగనుంది.

భారీగా అక్రమ లేఅవుట్లు

రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది జూలైలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రవేశ పెట్టింది. అనుమతుల్లేకుండా వేసిన లేఅవుట్లను ఈ పథకం ద్వారా క్రమబద్ధీకరిం చుకునే అవకాశం కల్పించింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలల్లో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వాస్తవా నికి 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తెచ్చింది. ఆ తర్వాత గడువు ముగియడంతో నిలిపివేసింది. అప్పట్లో వచ్చిన దర ఖాస్తుల్లో 65 శాతం వరకు పరిష్కరించింది. గత వైసీపీ ప్రభుత్వంలో మళ్లీ అనుమతులు తీసుకోని అక్రమ భవనాలు, లేఅవుట్లు భారీగా పెరిగాయి. అప్పటి అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఎక్కడికక్కడ అక్రమ లేఅవుట్లు వేసి విక్రయించి కోట్లు గడిం చారు. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించు కోలేదు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, నిడద వోలు, రాజానగరం, కాకినాడ రూరల్‌ నియోజక వర్గాల్లో ఈ తరహా లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

నాటి ధరలే నేడూ..

అనధికార లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం లేదు. దీంతో వారంతా లబోది బోమన్నారు. ప్రభుత్వం మారాక వీటిపై అధ్యయనం చేయా లని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వీటి క్రమబద్ధీకర ణకు ప్రభు త్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్‌ 30కి ముందు వేసిన లేఅవుట్లను ఈ పథకం కింద క్రమబద్ధీకరించు కోవడానికి ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. 2014- 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌లో నిర్దే శించిన బేసిక్‌ ధరలనే ఇప్పుడు నిర్ణయిం చారు. ఎల్‌ఆర్‌ ఎస్‌ అపరాధ రుసుముల కింద ప్లాట్‌ విస్తీర్ణం చదరపు మీటర్లలో 100 వరకు ఉంటే రూ.200,100-300 ఉంటే రూ.400, 300-500 వరకు రూ.600, 500పైన రూ.750 వరకు వసూలుకు నిర్ణయించారు. లేఅవుట్‌లో 10శాతం ఓపెన్‌ స్పేస్‌ లేకపోతే జరిమానాతో పాటు ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి ఆ భూమి బేసిక్‌ విలువలో ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీల కింద 14 శాతం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్రమబ ద్ధీకరణ కింద ఫీజులు 45 రోజుల్లోగా చెల్లిస్తే 10 శాతం, 90 రోజుల్లోగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రకటించింది. జూలైలో పథకాన్ని ప్రవేశపెట్టగా అక్టోబరు వరకు ప్రభుత్వం గడువిచ్చింది.తిరిగి వచ్చే నెల జనవరి 23వరకు పొడిగించింది.

తూర్పున 7,390..

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా తూర్పుగోదా వరి జిల్లా నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు భారీగా పోటెత్తాయి.జిల్లాలో డిసెంబరు 1 వరకు మొత్తం 7,390 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. రాజ మహేంద్రవరం కార్పొరేషన్‌ పరి ధిలో 1,305, రుడా పరిధిలో 5,266, నిడదవోలు మునిసి పాలిటీ 291, కొవ్వూరు పరిధిలో 528 వచ్చాయి. మొత్తం 5,255 దరఖాస్తుల్లో 1,384 అప్రూవల్‌ అవగా 522 దరఖాస్తులను తిరస్కరించారు. దర ఖాస్తుల ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం ప్రభు త్వానికి రూ.60.88 కోట్లు సమకూరనుంది. కార్పొరేషన్‌ పరిధిలో రూ.27.59 కోట్లు, రుడా ద్వారా రూ.25.78 కోట్లు జమకానుంది.

కాకినాడలో 5,839

కాకినాడ జిల్లాలో 5,839 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా రూ.44.71 కోట్లు ఆదాయం రానుంది. అత్యధికంగా కుడా పరిధిలో 4,327, కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో 316, ఉమ్మడి గుడాలో 305, గొల్లప్రోలు 55, పెద్దాపురం 115, పిఠాపురం 453, సామర్లకోట 58, తుని 149, ఏలేశ్వరంలో 59 చొప్పున వచ్చాయి. మొత్తం 5,839 దరఖాస్తుల్లో 2,780 అప్లికేషన్లకు ఆమో దం లభించగా 320 తిరస్కరించారు.

కోనసీమలో 2369

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2,369 దరఖాస్తులు వచ్చాయి. అమలాపురం మునిసిపాలిటీలో 437,అముడా 627, మండపేట 844, రామచంద్రపురం 182, ముమ్మి డివరం నగర పంచాయతీ పరిధిలో 279 చొప్పున వచ్చా యి. మొత్తం దరఖాస్తుల్లో 983 ఆమోదం పొందగా 89 తిరస్కరణకు గురయ్యాయి. కోనసీమ జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల ద్వారా రూ.21.45 కోట్లు ప్రభుత్వా నికి ఆదాయం సమకూరనుంది.ఉమ్మడి జిల్లా అంతా రూ.127 కోట్లు ఆదాయం సమకూరనుండగా ఇప్పటికే చాలా మంది అపరాధ రుసుములు చెల్లించడం ద్వారా సగానికిపైగానే వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:56 AM