Share News

రియల్‌ చాన్స్‌!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:07 AM

వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభు త్వం మరో అవకాశం కల్పించింది. గతంలోను అవకాశమిచ్చినా ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం అర్ధంతరం గా నిలిచిపోయింది.

రియల్‌ చాన్స్‌!

అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణ

కూటమి సర్కారు అవకాశం

జూలై 26న నోటిఫికేషన్‌

90 రోజుల పాటు అమలు

గతంలో 10,366 అప్లికేషన్లు

6,080 దరఖాస్తులకు ఓకే

రియల్టర్ల ఆనందం

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభు త్వం మరో అవకాశం కల్పించింది. గతంలోను అవకాశమిచ్చినా ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం అర్ధంతరం గా నిలిచిపోయింది.అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా దానికి కొన్ని సవరణలు చేస్తూ గత నెల 26న దీనికి సంబంధించి జీవో విడుదల చేసింది. అందులో ఈ ఏడా ది జూన్‌ 30వ తేదీలోపు రిజిస్టరయిన అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీనికి అక్టోబరు 24వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దరఖాస్తుదారులకు ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది.

గతంలో 10,366 మంది దరఖాస్తు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గతంలో 10,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.47.98 కోట్ల పాక్షిక అపరాధ రుసుం చెల్లిం చారు. వీటిలో 6,080 దరఖాస్తులు అప్రూవల్‌ అయ్యాయి. 990 దరఖాస్తులు తిరస్కరించారు. 1327 దరఖాస్తులకు షార్ట్‌ ఫాల్‌ నోటీసులు ఇచ్చారు. 379 దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంది. 1580 దరఖాస్తులు ఇంకా పెం డింగ్‌లో ఉన్నాయి. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం అర్ధంతరంగా నిలిచిపోయింది.దీనికి కొన్ని సవరణలు చేసి 2025 జూన్‌ 30లోపు రిజిస్టర్‌ అయిన అనధికార లే అవుట్లు, ప్లాట్లు అర్హత కలిగినవిగా సవరిస్తూ జీవోఎంఎస్‌ నెం.134ను 2025 జూలై 26న జారీ చేసిన నాటి నుంచి 90 రోజులు అంటే అక్టోబరు 24వ తేదీలోపు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోకపోతే నేరంగా పరిగణిస్తారు. అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అనధికార లే అవుట్లు, ప్లాట్లకు విద్యుత్‌, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వంటి వసతులు కల్పించరు. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయరు. అనధికార లే అవుట్లు, ప్లా ట్లు రిజిస్ట్రేషన్‌శాఖ నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదు చేస్తారు. దీంతో అమ్మకం, కొనుగోలు ఇతర లావాదేవీలు జరపడం యాజమానులకు సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దరఖాస్తు ఇలా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కౌడా), రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(రుడా), పిఠాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పాడా),అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (అముడా) పరిధిలో అర్హత కలిగిన అనధికార లేఅవుట్ల యజమానులు, అనధికార లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు తమ అనధికార లేఅవుట్ల, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ జ్ట్టిఞట:// ఛ్టీఛిఞ.్చఞ. జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో నేరుగా సిటిజన్‌ లాగిన్‌ లేదా ఆయా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీల్లో లైసెన్సు పొందిన ఎల్టీపీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రాయితీలు..

క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ఓపెన్‌ స్పేస్‌ చార్జీ లపై 50శాతం రాయితీ పొందుతారు.సెప్టెంబరు 19వ తేదీలోపు ఫీజు చెల్లిస్తే పెనాల్టీ చార్జీలపై 5 శాతం తగ్గింపును పొందుతారు. 4 వేల చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం గల వ్యక్తిగత స్థలా లు ప్రభుత్వ రహదారి, ఇప్పటికే ఉన్న రహదారి సదుపాయం కలిగి అనధికార లేఅవుట్లలో భాగం కాకపోతే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం కలుగుతుంది. రాయితీలు పొందొచ్చు.

అక్టోబరు 24 వరకు అవకాశం

అనధికార లే అవుట్లు,ప్లాట్ల యజమానులకు గుడ్‌ న్యూస్‌.. అక్టోబరు 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకుని అనధికార లే అవు ట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరించుకోవాలి.

రాహూల్‌ మీనా, జేసీ, వైస్‌ చైర్మన్‌, కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కాకినాడ

Updated Date - Aug 05 , 2025 | 01:07 AM