Share News

ఏసుక్రీస్తు చూపిన ప్రేమమార్గంలో నడుద్దాం..

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:02 AM

ప్రజలు చేసిన పాపాలను తనపై వేసుకుని శిలువపై చెప్పిన ఏడు మాట లను క్రైస్తవ విశ్వాసులంతా గుర్తించుకోవాలని బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల పాస్టర్‌ రెవ జె.ఎప్రాయీ ము, విక్టోరియారాణి, మన్నాజూబ్లీ చర్చి వ్యవస్థాపకుడు షారోన్‌రోజ్‌ కొమానపల్లి, రెవ ఎర్నెస్ట్‌ తాతపూడి, రెవ ఎస్తేరుజ్యోతి తాతపూడి పేర్కొన్నారు.

ఏసుక్రీస్తు చూపిన ప్రేమమార్గంలో నడుద్దాం..

అమలాపురం టౌన్‌/రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆం ధ్రజ్యోతి): ప్రజలు చేసిన పాపాలను తనపై వేసుకుని శిలువపై చెప్పిన ఏడు మాట లను క్రైస్తవ విశ్వాసులంతా గుర్తించుకోవాలని బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల పాస్టర్‌ రెవ జె.ఎప్రాయీ ము, విక్టోరియారాణి, మన్నాజూబ్లీ చర్చి వ్యవస్థాపకుడు షారోన్‌రోజ్‌ కొమానపల్లి, రెవ ఎర్నెస్ట్‌ తాతపూడి, రెవ ఎస్తేరుజ్యోతి తాతపూడి పేర్కొన్నారు. క్రీస్తు చూపిన ప్రేమమార్గంలో ప్రతీ ఒక్కరూ నడవాలన్నారు. మంచి శుక్రవా రం (గుడ్‌ఫ్రైడే)ను పురస్కరించుకుని అమ లా పురంలోని ప్రధాన క్రైస్తవ ప్రార్థనా మంది రాలన్నీ క్రైస్తవ విశ్వాసులతో కిటకిటలాడాయి. దేవాది దేవుడైన ఏసుక్రీస్తు పేరున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమలాపురం మెయి న్‌రోడ్డులోని సెయింట్‌ జాన్స్‌ లూథరన్‌ చర్చిలో క్రీస్తు శిలువపై ఉండి పలికిన ఏడు మాటలను, వాటి పరమార్థాన్ని వారు వివరించారు. మూడో రోజు ఆదివారం తిరిగి ఏసుక్రీస్తు పునరుద్ధానం జరిగే విధానాన్ని తెలియజేశారు. ఈస్టర్‌ పం డుగ సకల జనులకు శుభదినమన్నారు. ఈదరపల్లిలోని బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల, మన్నా జూబ్లీ చర్చిలో రెవ జె.ఎప్రాయీము, రెవ ఎర్నెస్ట్‌ తాతపూడి, రెవ ఎస్తేరుజ్యోతి తాతపూడి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిపాలవీధిలోని ఆర్‌సీఎం చర్చి, మెయిన్‌ రోడ్డులోని లూథరన్‌, జీడీఎం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వస్థతశాల నుంచి వందలాది మంది క్రైస్తవ విశ్వాసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈదరపల్లి మీదుగా అమలాపురం వరకు జరిగిన ర్యాలీలో అధికసంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 01:02 AM