రాత్రికి రాత్రే హైవేపై లారీల మాయం!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:21 AM
రాజానగరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): హైవేపై లారీల చోరీకి పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. కొంతకాలంగా హైవేపై పార్క్ చేసిన లారీలను అపహరించి, రాత్రికి రాత్రే మాయం చేయడమే పనిగా ఎంచుకున్న ఈ ముఠా కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలించి చివరకు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వై.శ్రీకాం త్, సీఐ ఎస్
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న రాజానగరం పోలీసులు
రూ.42 లక్షల విలువైన లారీ స్వాధీనం
రాజానగరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): హైవేపై లారీల చోరీకి పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. కొంతకాలంగా హైవేపై పార్క్ చేసిన లారీలను అపహరించి, రాత్రికి రాత్రే మాయం చేయడమే పనిగా ఎంచుకున్న ఈ ముఠా కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలించి చివరకు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వై.శ్రీకాం త్, సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ నిందితుల వివరాలు వెల్లడిం చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి నాగేశ్వరరావు హైవేపై గామన్ బ్రిడ్జ్ రోడ్డులో పాలచర్ల పంచాయతీ పరిధిలో ఏఎన్‌ఆర్ లారీ కాటా పేరున వేబ్రిడ్జ్ నడుపుతున్నాడు. దానిచెంతనే అతడి స్నేహితుడైన మన్యం గణేశ్వరరావు శ్రీకృష్ణా ఇన్ర్ఫా పేరుతో లారీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు నిర్వహిస్తున్నాడు. వేబ్రిడ్డ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో లారీలను పార్కింగ్ చేస్తుంటారు. గతనెల 24న గణేశ్వరరావు తన బంధువుల వివాహం నిమిత్తం హైదరాబాద్ వెళ్తూ తనకు చెందిన నాలుగు టిప్పర్‌లను సదరు ఖాళీ స్థలంలో పార్క్ చేసి తాళాలు నాగేశ్వరరావు ఆఫీసులో ఇచ్చాడు. 26న ఉదయం వేబ్రిడ్జి వద్దకు వ చ్చి చూసేసరికి గణేశ్వరరావుకు చెందిన టిప్పర్లలో ఏపీ 39 డబ్ల్యూ 7729 నెంబరు కలిగిన టిప్పర్ కనిపించలేదు. దీంతో నాగేశ్వరరావు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టా రు. సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసు లు ఈనెల 17న కొవ్వూరు మండలం దొమ్మేరు హైవేపై పొదల్లో లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసలో రాజస్థాన్ రాష్ట్రంలో ని ధహోటగావ్, ఖోహ్రీ తాలూకా భత్పూర్ జిల్లాకు చెందిన షాకత్ అలియాస్ షాకత్ ఖాన్, శేర్పూర్ గావ్, అల్వార్ జిల్లాకు చెందిన జమాల్ ఖాన్, సోహిల్, హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మహ్మద్ ఫసిఉద్దీన్‌ను నిందితులుగా నిర్ధారించి అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. చోరీకి గురైన లారీ విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. గతంలో వీరిపై 5 కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ ప్రియకుమార్, హెడ్ కానిస్టేబుల్ అమ్మిరాజు, నరేష్ రాజు, సత్య నారాయణ, క్రైం సురేష్, బీవీ రమణను డీఎస్పీ అభినందించారు. కేసు దర్యాప్తు వేగవం తం గా చేపట్టిన డీఎస్పీ,సీఐను ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు.