Share News

లారీల చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:50 AM

పిఠాపురం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన ఆయిల్‌ప్యాకెట్లు, నూకల లోడు లారీల చోరీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రెం డు లారీలు, ట్రాక్టర్‌తో పాటు చోరీకి గురైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పిఠాపురంలో సోమవారం సాయంత్రం విలేకర్లకు సీఐ జి.శ్రీనివాస్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిఠాపురంలోని

లారీల చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌
నిందితుల అరెస్టు చూపుతున్న పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు

పరారీలో మరో ఇద్దరు నిందితులు

రూ.54.88 లక్షల విలువైన

ఆయిల్‌ప్యాకెట్లు, నూకల నిల్వలు స్వాధీనం

రెండు లారీలు, ట్రాక్టర్‌ సీజ్‌

పిఠాపురం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన ఆయిల్‌ప్యాకెట్లు, నూకల లోడు లారీల చోరీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రెం డు లారీలు, ట్రాక్టర్‌తో పాటు చోరీకి గురైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పిఠాపురంలో సోమవారం సాయంత్రం విలేకర్లకు సీఐ జి.శ్రీనివాస్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పిఠాపురంలోని కుంతీమాధవస్వామి గుడి వద్ద ఈనెల 5న రాత్రి ఉంచిన లారీని రూ.26.83 లక్షల విలువైన ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ప్యాకెట్లుతో సహా చోరీ చేసినట్టు కాకినాడకు చెందిన దగ్గు అప్పారావు ఈనెల 6న ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా డ్రైవర్స్‌ కాలనీ వద్ద ఉంచిన నూకల లోడు లారీని గుర్తు తెలియని ఆగంతుకులు దొం గలించినట్టు ఆకుల ప్రసాద్‌ ఫిర్యాదు చేయగా పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో 2 కేసులను నమోదు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు కాకినాడ ఏఎస్పీ పర్యవేక్షణలో పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, సర్కిల్‌ ఎస్‌ఐలు మణికుమార్‌, జానీభాషా, ఎన్‌.రామకృష్ణ, వెంకటేష్‌ ఆధ్వర్యంలో 5 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ సాగించారు. చేబ్రోలు నుంచి వజ్రకూటం వెళ్లే ఎలబంద పుంతరోడ్డులో యాల ంక వారి గరువు వద్ద నిందితులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం పిఠాపురం పట్టణం బొజ్జావారితోటకు చెందిన బెల్లంకొండ రవితేజ, కోటగుమ్మం ప్రాంతానికి నాగిరెడ్డి నాగ సతీష్‌, లయన్స్‌క్లబ్‌ ఏరియాకు చెందిన గంజి సురేష్‌, పండూరుకు చెందిన శంఖవరం మం డలం మండపంలో నివాసముంటున్న నందిపాటి వీర సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన 2 లారీలు, సరుకు రవాణాకు వినియోగించిన ట్రాక్టర్‌, ట్రక్‌లు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ప్యాకెట్లు బాక్సులు, నూకలతో కూడిన కోళ్లమేత బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.54.88 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉం దని, 63సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌బ ండిల్స్‌ స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. కాగా నిందితుల్లో ప్రధాన వ్యక్తిగా ఉన్న బెల్లంకొండ రవితేజ గతంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం లోడు లారీ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు.

నిందితులు... జనసేనతో సంబంధాలు!

అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు జనసేన పార్టీకి చెందిన వారున్నట్టు చెప్తున్నా రు. వీరిలో ఒకరు లారీ యూనియన్‌ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగి ంచారు. వీరు కొందరు జనసేన కీలక నేతలతో దిగిన ఫోటోలు సోష ల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు.

Updated Date - Aug 12 , 2025 | 01:50 AM