మట్టి గణపతి.. మహా గణపతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:40 AM
గ ణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మం డలంలోని పలు విద్యా సంస్థల్లో చిన్నారులు పర్యావరణాన్ని చూటి చెబుతూ వివిధ ఆకృ తుల్లో రూపొదిద్దుకున్న బుజ్జి బుజ్జి మట్టి గణనాథుల ప్రతిమలు అందరీ అబ్బురపరి చాయి. వివిధ పాఠశాలలు, కళాశాలల్లోని వి ద్యార్థులంతా జీవం ఉట్టిపడేలా గణపయ్య మట్టి ప్రతిమలను తీర్చిదిద్దారు.
విద్యాసంస్థల్లో వినాయక ప్రతిమలు తయారు చేసిన విద్యార్థులు
పలువురికి పంపిణీ
రాజానగరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గ ణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మం డలంలోని పలు విద్యా సంస్థల్లో చిన్నారులు పర్యావరణాన్ని చూటి చెబుతూ వివిధ ఆకృ తుల్లో రూపొదిద్దుకున్న బుజ్జి బుజ్జి మట్టి గణనాథుల ప్రతిమలు అందరీ అబ్బురపరి చాయి. వివిధ పాఠశాలలు, కళాశాలల్లోని వి ద్యార్థులంతా జీవం ఉట్టిపడేలా గణపయ్య మట్టి ప్రతిమలను తీర్చిదిద్దారు. వెలుగుబంద లోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులు హెచ్‌ఎం పవన్‌కుమార్ ఆధ్వర్యంలో ఏకో గణేష్ పేరిట పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం యర్రా ఆగ్నేశ్వరరావు, ఎంఈవోలు రామన్నదొర, జ్యోతి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ పర్యా వరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మ ట్టి గణపతిని పూజించాలన్నారు. మట్టి ప్రతిమలు తయారు చేసి న చిన్నారులను ఎంఈవోలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. రాజానగరంలో ని దివ్య విద్యాసంస్థల ఆధ్వర్యం లో విద్యార్థులు వివిధ ఆకృతు ల్లో మట్టి, వరి పిండి, కాగితాల తో గణపతి ప్రతిమలు, విగ్రహా లను రూపొందించారు. చిన్నారు లు గణనాథుల వేషధారణలతో అలరించారు. దివ్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ బర్ల విజయ్, ప్రిన్సిపాల్ రామచంద్రరావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. గోదావరి గ్లో బల్ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ విభా గం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి ప్రతిమల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు పోటా పోటీగా మట్టి బొమ్మలను తయారు చేశారు. విద్యార్థులను వీసీ యు.చంద్రశేఖర్, అధ్యా పకులు అభినందించారు.