Share News

శివకేశవులకు ప్రీతికరం

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:37 AM

శివ, కేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమైంది. శరదృతువులో వచ్చే కార్తీకమాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మా సానికి కార్తీకమాసమని పేరు. మంగళవారం సాయంత్రం అమావాస్య గడియలు ముగిసిన వెంటనే నగరంలోని భక్తులు స్థానిక పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులలో కార్తీక స్నానాలు ఆచరించారు.

శివకేశవులకు ప్రీతికరం
కార్తీకమాసం సందర్భంగా బిక్కవోలులో విద్యుత్‌ దీపాలంకరణలో ప్రాచీన ఆలయాలు

  • కార్తీక మాసం ప్రారంభం

  • గోదావరి రేవుల్లో పుణ్య స్నానాలు

  • శివాలయాల్లో భక్తుల పూజలు

  • ఆలయాలకు కార్తీక శోభ

రాజమహేంద్రవరం సిటీ/కోరుకొండ/బిక్కవో లు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శివ, కేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమైంది. శరదృతువులో వచ్చే కార్తీకమాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మా సానికి కార్తీకమాసమని పేరు. మంగళవారం సాయంత్రం అమావాస్య గడియలు ముగిసిన వెంటనే నగరంలోని భక్తులు స్థానిక పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులలో కార్తీక స్నానాలు ఆచరించారు.ఈ సందర్భంగా అన్ని శివాలయా లు, విష్ణు ఆలయాలు వద్ద కార్తీక ఆకాశ దీపా లు వైభవంగా ప్రారంభమయ్యాయి.రాజమహేంద్రవరంలో కోటిలింగాలరేవు, పుష్కరాల రేవు, చింతాలమ్మ ఘాట్‌, గౌతమి ఘాట్‌, సరస్వతి ఘాట్‌లను కార్తీక స్నానాలకు సిద్ధం చేశారు. రేవులను శుభ్రం చేసి భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా తయారు చేశారు. మం గళవారం సాయంత్రం, అర్ధరాత్రి దాటాక బుధ వారం వేకువజామున కార్తీక స్నానాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో నదీ స్నానాలు చేసి హరి, హరుల దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో కార్తీక మాసంలో శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు రాజమహేంద్రవరం చేరుకుని పుణ్యస్నానాలు చేసి గోదావరిలో అరటి డొప్పలు, కొబ్బరి చిప్పలు, నిమ్మ డొప్పలు, ఉసిరి కాయలపై దీపా లు వెలిగించి నదీలో విడిచిపేట్టారు. దీపదానా లు, శాలిగ్రామ దానాలు చేశారు. నగరంలోని కోటిలింగాల క్షేత్రం, ఉమామార్కండేయస్వామి ఆలయం,విశ్వేశ్వరాలయం, సర్వేశ్వరాలయం, ఉజ్జయి న మహాకాలేశ్వరాలయం, సారంగధరేశ్వరాలయం. సోమలింగేశ్వరాలయం, ఉ మారామలిగేశ్వరాలయం లో భక్తులు స్వామిని ద ర్శించుకుని దీపాలు వెలిగించారు. దీంతో ఆయా ఆలయాలు కార్తీక శోభతో కళకళలాడాయి. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం నుంచి పంచారామాల దర్శనానికి వెళ్లేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అలాగే కోరుకొం డ మండలం నర్సాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయం వద్ద ఆకాశ దీపాలను మద్దాల బా లాజీ, రామలక్ష్మి దంపతులు వెలిగించారు. జం బుపట్నంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, కోరుకొం డ విశ్వేశ్వరస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, బూరుగుపూడి, శ్రీరంగపట్నం, కాపవరం, పశ్చిమగోనగూడెం, రాఘవాపురం, కోటికేశవరం,గాడాల,గాదరాడ,కణుపూరు శివాలయాల వద్ద కార్తీక ఆకాశ దీపాలను వెలిగించారు.

కార్తీకమాస పూజలకు బిక్కవోలు మండలంలోని శివాలయాలు, విష్ణుమూర్తి ఆలయాలు ముస్తాబయ్యాయి. బిక్కవోలులో 1100 యేళ్ల క్రితం తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించిన శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయంలో వున్న గోలింగేశ్వర, పార్వ తిదేవి, రాజరాజేశ్వరి సమేత రాజేశ్వరస్వామి,బాలాత్రిపుర సుం దరి సమేత చంద్రశేఖరస్వామి వార్ల దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్‌ తెలిపారు. బిక్కవోలులోని గోలింగేశ్వరస్వామి ఆలయంతో పా టు క్షేత్రపాలకులైన లక్ష్మీనారాయణస్వామి ఆల యాన్ని కూడా భక్తులు ద ర్శనాలకు సిద్ధం చేశారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం గోలింగేశ్వరస్వామికి లక్ష ల్వా ర్చన, పార్వతిదేవి లక్ష కుంకుమార్చన జరుపుతామని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 01:37 AM