గణేశ్‌కు వీడ్కోలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:49 AM
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజులుగా భక్తుల పూజలందుకున్న గణనాథులకు ఆదివా రం గ్రామోత్సవాలు, నిమజ్జనోత్సవాలను ఘ నంగా జరిపించారు. గణపతి బప్పా మోరియా అంటూ బ్యాండ్ మేళాలు, బాణా సంచా కాల్పులతో గ్రామాల్లో ఊరేగించారు. ఈ నెల 7న సంపూ ర్ణ చంద్రగ్రహం ఏర్పడనుండడం తో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది తొమ్మిది రోజులు పాటు మాత్రమే నిర్వహించే అవకాశం ఉంద ని వేదపండితులు ముందు నుంచి చెప్ప డంతో ఐదో రోజున విగ్రహాల నిమజ్జనోత్సవాల ను కన్నుల పండువుగా నిర్వ హించారు.
భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాలు
గోదావరి రేవు వరకు అనుమతి
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రక్రియ
నదిలో కలుపుతున్న నగరపాలక సంస్థ సిబ్బంది
రాజమహేంద్రవరం సిటీ/రాజానగరం/అనపర్తి/ధవళేశ్వరం, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజులుగా భక్తుల పూజలందుకున్న గణనాథులకు ఆదివా రం గ్రామోత్సవాలు, నిమజ్జనోత్సవాలను ఘ నంగా జరిపించారు. గణపతి బప్పా మోరియా అంటూ బ్యాండ్ మేళాలు, బాణా సంచా కాల్పులతో గ్రామాల్లో ఊరేగించారు. ఈ నెల 7న సంపూ ర్ణ చంద్రగ్రహం ఏర్పడనుండడం తో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది తొమ్మిది రోజులు పాటు మాత్రమే నిర్వహించే అవకాశం ఉంద ని వేదపండితులు ముందు నుంచి చెప్ప డంతో ఐదో రోజున విగ్రహాల నిమజ్జనోత్సవాల ను కన్నుల పండువుగా నిర్వ హించారు. దీనిలో భాగంగా భక్తులకు ప్రసాద వితరణ, అ న్నదాన కార్యక్రమాలు విరివి గా జరిపించారు. రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పర్య వేక్షణలో స్థానిక గోదావరి బండ్ వద్ద ఉన్న పాత కుమా రి ర్యాంప్ వద్ద ప్రత్యేకమైన క్రేన్‌ను ఏర్పాటు చేసి విగ్రహాలను కిందకు దించి అటుపై వాటిని పంటులోకి చేర్చి నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి అడపాదడపాగా నిమజ్జనం చే స్తున్నారు. ఊరేగింపులను పు ష్కరాల రేవు వరకు అను మ తించి అటుపై కుమారి రేవులోకి విగ్రహాలతో ఉన్న వాహనాలను మాత్రమే వరుస క్రమం లో అనుమతిస్తున్నారు. రాత్రి 10గంట ల సమయానికి పలు చోట్ల నుంచి వచ్చినచిన్నాపెద్ద విగ్రహాలు మొత్తం 180 వరకూ విగ్రహాల ను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా అనపర్తిలోని పాతవూరిలో శివాలయం వద్ద బాలలు నెలకొల్పిన బాల గణపతి విగ్రహాన్ని మినీ వ్యా నులో ఊరేగించి బ్రాహ్మణ రేవులో నిమజ్జనం చేశారు. ధవళేశ్వరంలోని గొల్లపేట రామాలయ వీధిలో మహిళలు ఏర్పాటు చేసిన చవితి మండపా ల్లో గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి రామపాదాల రేవు వద్ద నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం మండపం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకుడు సావాడ శ్రీనివాస రెడ్డి ఆర్థిక సహాయం చేశారు.