జై..జై..గణేశా!
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:13 AM
విఘ్నాలను తొలగించే వినాయక చవితిని అన్ని గ్రామాల్లో ప్ర జలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఇంట మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పాలవెల్లి కట్టి కలశస్థాపన చేసి పూజలు చేసుకున్నారు. వినాయక వత్ర కథ చదువుకున్నారు. విద్యార్థులు తమకు చదువు బాగా రావాలని వి నాయకుడి ముందు పెన్నులు, పుస్తకాలు ఉంచి పూజల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి
ప్రత్యేక మండపాల్లో కొలువుదీరిన గణనాథులు
రాజానగరంలో రూ.3.60 లక్షలతో మహాభారతం గణపతి
దివాన్‌చెరువు/రంగంపేట/సీతానగరం/కోరుకొండ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): విఘ్నాలను తొలగించే వినాయక చవితిని అన్ని గ్రామాల్లో ప్ర జలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఇంట మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పాలవెల్లి కట్టి కలశస్థాపన చేసి పూజలు చేసుకున్నారు. వినాయక వత్ర కథ చదువుకున్నారు. విద్యార్థులు తమకు చదువు బాగా రావాలని వి నాయకుడి ముందు పెన్నులు, పుస్తకాలు ఉంచి పూజల్లో పాల్గొన్నారు. దివాన్‌చెరువు, పాలచర్ల, లాలాచెరువు హౌసింగ్‌బోర్డుకాలనీ, కొత్తతుంగపాడు తదితర గ్రామాల్లో వినాయక నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించారు. బుధవారం ఉదయం వినాయక విగ్రహాలను ప్రతిష్టించి వాటికి పూజలు చేయడం ద్వారా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తమ ఇండ్లలో చవితి పూజలను పూర్తిచేసుకున్న అనంతరం తమ సమీపంలోని ఆలయాలు, ప్రత్యేక పందిళ్లలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు. ఇక వినాయక చవితికి పందిళ్లలో ఏర్పాటు చేసే లడ్డూలకు ప్రత్యేకత ఉంటుంది. కొత్తతుంగపాడులోని గణపతి ఆలయంలో 100 కిలోలకు పైగా రెండు లడ్డూలను ఇద్దరు భక్తులు ఏర్పాటు చేశారు. పాతతుంగపాడులోని మ త్స్యేంద్రనాథ్ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో నూతన లంజపల్లి శ్రీను, వీరలక్ష్మి పాల్గొని పూజ లు జరిపారు. కొత్తపల్లి గోవిందు 105 కిలోలు, గండి శివమణికంఠ 101 కిలోల లడ్డూలను దేవుడికి సమర్పించారని ఉత్సవ కమిటీ తెలిపింది. దీనితో బాటు దాదాపు మరో 20 మంది లడ్డూలను స్వామికి అందజేశారని అన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇంట ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గణపతి పూజ చేశారు.