లోకేశ్..జోష్!
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:26 AM
రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన కేడర్‌లో జోష్ పెంచింది.
విద్యార్థులతో ముఖాముఖి
యువత రాజకీయాల్లోకి రండి
నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం
సెల్ఫీలకు విద్యార్థులు, నేతల క్యూ
రాజమహేంద్రవరం/సిటీ/అర్బన్/ దివాన్ చెరువు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన కేడర్‌లో జోష్ పెంచింది. అడుగడుగునా లోకేశ్‌కు టీడీపీ నాయకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఉద యం 9.30 గంటలకు విమానాశ్రయానికి రావాల్సిన లోకేశ్ కొంత ఆలస్యంగా సుమా రు 9.45 గంటలకు చేరుకున్నారు. ఆయన పర్యటన రాత్రి 7 గంటలకు ముగియగా 7.30 గంటలకు విమానంలో తిరుగు పయ నమయ్యారు. మంత్రి లోకేశ్ శుక్రవారం సుమారు మూడు గంటలసేపు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోనే గడిపారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. యువత రాజకీ యాల్లో రావాలన్నారు. దశలు వారీగా లైబ్రరీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గూగుల్ సంస్థకు చెందిన ఏఐ టూల్ జెమిని సాంకేతికతను విద్యార్థులకు ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. గోదావరి జిల్లాల్లో అక్వా రంగం మరింత అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంటామ న్నారు. అలాగే పరిశ్రమలకు తగ్గట్టుగా కోర్సులు ఉండాలన్నారు. హయ్యర్ ఎడ్యు కేషన్‌పై మీ విజన్ ఏంటని కళాశాల ప్రిన్సి పాల్ కె.రామచంద్రరావు ప్రశ్నించగా.. మన పాఠాలు ఇండ స్ర్టియల్ ఓరియంటెడ్‌గా ఉండాలన్నారు. సభకు వ్యాఖ్యాతగా వ్యవ హరించిన లెక్చరర్ ఎన్.శ్రీనివాస్..సార్ అని మంత్రి లోకేశ్‌ను పిలవగా.. గురువుగారూ లోకేశ్ అని పిల వండి.సార్ అని సంబో ధించడం కరెక్ట్ కాదు అని ఆయన సమా ధానం ఇవ్వడంతో అందరూ వినమ్రంగా విన్నారు. డిగ్రీ విద్యార్థులకు పీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మంత్రి లోకేశ్‌ను కలిసి వినతి పత్రం అందించామని టి.కె.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.చెరుకూరి ఫంక్షన్ హాల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సిటీ కార్యకర్తల సమా వేశంలో పార్టీ గురించి , కార్యకర్తల గుర్తింపు గురించి మాట్లాడి ఉత్సాహం తె చ్చారు.అనంతం కూటమి ఎమ్మెల్యేలు, నేత లతో సుమారు గంట సేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, పేరా బత్తుల రాజశేఖరం, కర్రిపద్మశ్రీ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జెసీ వై.మేఘస్వరూప్, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్, వీసీ ఆచార్యఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి తదితరులు పాల్గొన్నారు.
పలు భవనాలు ప్రారంభం
మంత్రి లోకేశ్ శుక్రవారం ఆర్ట్స్ కళాశాల, నన్నయ్య వర్శిటీలో పలు భవనాలను ప్రారంభించారు. ముందుగా ఆర్ట్స్ కళాశాల ప్రధానద్వారాన్ని ప్రారంభించి, కళాశాల లోగోను ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ బ్లాక్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను తిలకించారు. హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ సైన్స్ ప్రాజెక్టును పరిశీలించారు. వాల్ ఆఫ్ ఫేమ్‌లో సంతకం చేశారు. ఆ తర్వాత కాలేజీలో వందేమాతరం మూవ్‌మెంట్ మెమోరియల్ ఆవిష్కరించారు. విదేశీ విద్యార్థుల పరిశోధనలకు నూతనంగా నిర్మించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ బిల్డింగ్ ప్రారంభించారు. అరకు కాఫీ కెఫేను సందర్శించారు. ఆ తర్వాత కాలేజీ లైబ్రరీని సందర్శించారు. కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్రరావు మంత్రి లోకేష్‌కు ‘సమ్ మెడిటేషన్స్ ఆఫ్ మార్కస్ ఆర్లియస్ ఆంటోనీనస్ ప్రజెంటేషన్’ అనే పుస్తకాన్ని బహూకరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రూ33.80 కోట్లతో నిర్మించిన ఇంజనీరింగ్ భవనం, పరీక్షభవనం, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ భవనాలను ప్రారంభించారు. వర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనం ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ఆదికవి నన్నయ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. విశ్వవిద్యాలయం తరపున విసీ ప్రసన్నశ్రీ జ్ఞాపిక అందజేశారు. తరువాత వర్శిటీలో మంత్రి లోకేశ్ విద్యార్దులకు అభివాదం చేస్తూ సెల్ఫీలు దిగారు. తొలుత ఇంజనీరింగ్ కళాశాల భవనం వద్ద వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ సమక్షంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.