Share News

రాజీపడితే తగ్గినట్టు కాదు.. నెగ్గినట్టు!

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:04 AM

సత్వర న్యాయమే లోక్‌ అదాలత్‌ల లక్ష్యమని.. రాజీ పడితే తగ్గినట్టు కాదని.. నెగ్గినట్టని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత పేర్కొన్నారు.

రాజీపడితే తగ్గినట్టు కాదు.. నెగ్గినట్టు!
బాధిత కుటుంబానికి రూ.కోటి నమూనా చెక్‌ అందజేస్తున్న ఉమ్మడి జిల్లా జడ్జి సునీత

రాజమహేంద్రవరం, జూలై5(ఆంధ్ర జ్యో తి): సత్వర న్యాయమే లోక్‌ అదాలత్‌ల లక్ష్యమని.. రాజీ పడితే తగ్గినట్టు కాదని.. నెగ్గినట్టని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం 47 బెంచ్‌లపై జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. రాజమహేంద్రవరం డీఎల్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో పీడీజే ప్రారంభించి మాట్లా డారు. రాజీమార్గం ఎప్పుడూ రాజమార్గమే నన్న విషయం మరువరాదన్నారు. జిల్లాలో మొత్తం 85వేల కేసులు పెండింగ్‌లో ఉం డగా 60, 642 రాజీకి యోగ్యమైనవన్నారు. వీటిలో 9,272 సివిల్‌, క్రిమినల్‌, 2136 ప్రీ లిటిగేషన్‌ కేసులు ఉన్నాయన్నారు. పీడీజే కోర్టులో కేసు నెం.1/2025కి సంబంధించి కక్షిదారుడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కం పెనీ ద్వారా చెల్లించే రూ.1.15 కోట్ల పరి హారం నమూనా చెక్కు అందజేశారు. శని వారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 47 బెంచ్‌లపై 6,179 వేల కేసులను పరి ష్కరించారు. ఇందులో సివిల్‌ 473, క్రిమి నల్‌ 5,514, పీఎల్‌సీ 192 కేసులు ఉన్నా యి. రాత్రి 9.30 గంటల తర్వాత పూర్త యిన కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు. లోక్‌ అదాలత్‌లో బాధితులకు 18,67,73, 973 పరిహారం అవార్డును చెల్లించారు.

Updated Date - Jul 06 , 2025 | 01:04 AM