స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:04 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలని టీడీపీ నియోజవర్గ ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. బలభద్రపురం ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సంస్థాగత ఎన్నికలు-2025లో భాగంగా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ కమిటీలు, బూత్ లెవెల్ కన్వీనర్, కో కన్వీనర్ల నియామకం కోసం నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించా రు.
ఆ దిశగా కమిటీలు పనిచేయాలి
టీడీపీ అనపర్తి నియోజకవర్గ పరిశీలకుడు అప్పారావు
బిక్కవోలు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలని టీడీపీ నియోజవర్గ ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. బలభద్రపురం ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సంస్థాగత ఎన్నికలు-2025లో భాగంగా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ కమిటీలు, బూత్ లెవెల్ కన్వీనర్, కో కన్వీనర్ల నియామకం కోసం నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా అప్పారావు మా ట్లాడుతూ బూత్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. త్వరలోనే కమిటీలను పూర్తి చేసి అధిష్ఠానానికి పంపిస్తామన్నారు. మ నోజ్ మాట్లాడుతూ టీడీపీ గ్రామ శాఖలో అధ్య క్షుడిగా ఓసీ వర్గం వ్యక్తిని నియమిస్తే, ఎస్సీ లే దా బీసీల వర్గాల వ్యక్తులను ఉపాధ్యక్షులు లేక ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీ ఆదేశించిందన్నారు. బూత్ లెవెల్‌లో వున్న సమస్యలు తెల్సుకుని పరిష్కరించేందుకు కమిటీలను నియమిస్తున్నట్టు చెప్పా రు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల పరిశీలకుడు నాదెండ్ల శ్రీరామ్‌చౌదరి, 4 మండలాల పరిశీలకులు ఆండ్రు అనిల్, రొంగల సత్యనారాయణ, లంక సత్యనారాయణ, టి.సత్యనారాయణ, నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరావు, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, జుత్తుగ కృష్ణ, వెలుగుబంట్ల సత్తిబాబు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, పాలచర్ల చౌదరి, ఆళ్ల గోవిందు, కర్రి శేషారత్నం పాల్గొన్నారు.