ఎల్‌హెచ్‌ఎంఎస్.. చోరీలకు నో ఛాన్స్!
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:33 AM
కాకినాడ క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఉ మ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఇటీవల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు గుల్ల అయిపోతున్నాయి. ఈ తరహాలోనే ద్విచక్ర వాహనాల దొంగతనాలు, చైన్‌స్నా చింగ్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ నేప థ్యంలో ఇటీవల ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే ముఠాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్‌డీపీ వో దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణ
తాళం వేసి ఉన్న ఇళ్లే
లక్ష్యంగా దొంగతనాలు
లాక్డ్ హౌస్ మోనటరింగ్
సిస్టంతో అదుపు
సీసీ కెమెరాలతో పట్టుకునే అవకాశం
అవగాహన కల్పిస్తున్న పోలీసులు
కాకినాడ క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఉ మ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఇటీవల దొంగతనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు గుల్ల అయిపోతున్నాయి. ఈ తరహాలోనే ద్విచక్ర వాహనాల దొంగతనాలు, చైన్‌స్నా చింగ్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ నేప థ్యంలో ఇటీవల ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే ముఠాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్‌డీపీ వో దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో, క్రైం సీఐ వికృష్ణ సిబ్బందితో కలిసి పట్టుకుని అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్లలో చోరీల కు పాల్పడే దొంగలను పోలీసులు పట్టుకున్న సంఘటనలు జరిగాయి. పోలీస్‌శాఖ అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి నేరాలను చేధించి నిం దితులను పట్టుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తే నేరాలను కట్టడి చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు. లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్)పై అవగాహన కల్పిస్తున్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉపయోగం ఏంటి?
దూర ప్రాంతాలకు ఎక్కువ రోజులు ఉండే విధంగా ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో ఆయా ప్రాంతాల వాసులు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం తెలియపరిస్తే ఆ ఇంటికి పో లీసులు ఉచితంగా లాక్డ్ హౌస్ మోనటరింగ్ సి స్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) కెమెరాలను అమర్చుతా రు. తద్వారా విలువైన బంగారు ఆభరణాలు, వెం డి వస్తువులు, నగదు, డాక్యుమెంట్‌లు దొంగల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఎల్‌హెచ్ ఎంఎస్ కెమెరాలు అమర్చడం ద్వారా తాళం వే సిన ఇంటిలో దొంగలు పడితే ఆ సమాచారం సం బంధిత పోలీస్ అధికారికి, పోలీస్ కంట్రోల్ రూ మ్‌కు, అలాగే ఆ ఇంటి యజమానికి అలారం సిస్టం ద్వారా తెలుస్తోంది. దీంతో వెంటనే దొంగలను సులువుగా పట్టుకోవచ్చు. అలాగే ముఖ్యం గా దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి బయట గేటుకు గాని, మెయిన్ డోర్‌కుగాని వేసే తాళం కప్పలు కనబడకుండా జాగ్రత్త పడాలి. ఇంటి బయట గేటులకు తాళం కనిపించే విధంగా వేస్తే యజమానులు ఇంటిలో లేరని గ్రహించి దొంగతనానికి సిద్ధపడే అవకాశం ఉంది. ఇంటి బయట రాత్రి సమయాల్లో లైటు వెలిగేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రత పెరగడంతో పాటు నేరాలు జరగకుండా అరికట్టవచ్చు.
ముందస్తు చర్యలు పాటించాలి
కొంతమంది యువకులు వ్యసనాలకు బానిస లై సులువుగా కష్టపడకుండా జల్సాలు చేసుకునే క్రమంలో ఇళ్లలో చోరీలు, నడిచి వెళ్తున్న మహిళలు, వృద్ధుల మెడలోని బంగారు ఆభరణాలు తస్కరించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్‌శాఖలో వచ్చిన అత్యాధునిక సాంకేతికత ద్వారా కేసులను త్వరితగతిన చేధించగలుగుతున్నాం. ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తే నేరాలను అదుపు చేయ వచ్చు.
వి.కృష్ణ, క్రైం సీఐ, కాకినాడ