కార్యకర్తల పండుగ టీడీపీ మహానాడు
ABN , Publish Date - May 21 , 2025 | 12:24 AM
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిజమైన పండుగ మహానాడు అని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు.
ఫ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం
ఫరాజోలు నియోజకవర్గ మహానాడు
మలికిపురం, మే 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిజమైన పండుగ మహానాడు అని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో అడబాల యుగంధర్ అధ్యక్షతన జరిగిన రాజోలు నియోజకవర్గ మహానాడులో ముఖ్య అతిథిగా రాజశేఖరం మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు మూల స్తంభాలని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పేదలకు కూడు, గూడు, నీడ అందించి ఒక చరిత్ర సృష్టించిన మహా నాయకుడు అన్నారు. ఎన్టీఆర్ మహిళలను, బడుగు, బలహీనవర్గాలను అన్నివిధాలా ముందుకు నడిపించారని, అదే బాటలో సీఎం చంద్రబాబునాయుడు నడుస్తూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన జరుగుతుందని, ఇది నిజమైన ప్రజా ప్రభుత్వమని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు రాజోలు నియోజకవర్గం నుంచి వేలాదిగా రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం మహానాడులో రైతు, మహిళా, యువత, పంచాయతీరాజ్, చంద్రన్న బీమా, బీసీల కోసం, ఎస్సీల కోసం తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. కార్యక్రమంలో చిటికెన రామ్మోహనరావు, అడబాల యుగంధర్, గుబ్బల శ్రీనివాస్, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, మొల్లేటి శ్రీనివాస్, కేతా శ్రీనివాస్, మంగెన భూదేవి, మంగెన రాధాకృష్ణమూర్తి, భూపతిరాజు ఈశ్వరవర్మ, గెడ్డం సింహ, ఈలి శ్రీనివాస్, చెల్లుబోయిన శ్రీను, బోళ్ల వెంకటరమణ, రాపాక నవరత్నం, తాడి సత్యనారాయణ, బోనం సాయిరామ్, అడబాల సాయిబాబు, కాకి లక్ష్మణ్, బందెల పద్మ, మోకా పార్వతి, భవానీలావణ్య, హెలీన, మట్టపర్తి లక్ష్మి, అనుసూరి పురుషోత్తం, రాపాక ఆనంద్‌కుమార్, అంతర్వేదిపాలెంపుల్లయ్య, కాండ్రేగుల రాము, కౌరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.