ఆడశిశు రక్షణకు చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:32 AM
ఆడశిశు జననాల పట్ల వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు పీసీపీఎన్డీటీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చే యాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ (కాకినాడ),ఏప్రిల్26 (ఆంధ్ర జ్యోతి): ఆడశిశు జననాల పట్ల వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు పీసీపీఎన్డీటీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చే యాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. కాకి నాడ కలెక్టరేట్ కోర్టుహాలులో పీసీపీఎస్డీటీ చట్టం అమలుపై శనివారం ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అలా్ట్రసౌండ్ స్కానర్లను పిండ లింగ నిర్ధారణకు దుర్వినియోగం చేయ కుండా నిరోధించేందుకు స్కానింగ్ సెంట ర్లలో నిర్వహించిన రహస్య డెకాయ్ ఆపరే షన్ల గురించి సమీక్షించారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్‌వో నరసింహనాయక్, ప్రోగ్రాం ఆఫీసర్లు రమేష్, డాక్టర్ సరిత, సుబ్బరాజు, ఏపీపీ నాగబాబు, పోలీస్ అధి కారి రామచంద్రరావు పాల్గొన్నారు.
హైరిస్క్ ప్రెగ్నెన్సీలపై జాగ్రత్త
హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల పట్ల మరింత నిశిత వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలను పాటించడం ద్వారా ప్రసూతి మరణాలను నివారించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రాహుల్‌మీనా వైద్యాధికారులను ఆదేశిం చారు. కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం ప్రసవ సమయంలో మాతా శిశు మర ణాల నివారణ కార్యచరణపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఆరు నెలల కాలం లో జిల్లాలో సంభవించిన 9 మాతృ మర ణాలపై విశ్లేషించి, అలాంటి అవాంచనీయ మరణాలు పునరావృతం కాకుండా చేప ట్టాల్సిన చర్యలను ఆయన సూచించారు.