తొలివిడత తేలింది!
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:55 AM
రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భూముల రీసర్వే క్రతువు కొలిక్కి వస్తోంది. తొలి విడతగా 48 గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించి రైతులకు నోటీసులు జారీచేశారు. ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాలో తొలి విడత (పైలెట్ ప్రాజెక్ట్)గా 48 గ్రామాల్లో భూ ముల రీసర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూముల రీసర్వే
48 గ్రామాల్లో 52,280 మందికి నోటీసులు జారీ
21రోజుల్లో నోటీసులకు బదులివ్వాలి
అభ్యంతరాల స్వీకరణ తర్వాత జేసీ లాగిన్‌కు నివేదిక
జేసీ ఆధ్వర్యంలో రీ సర్వే నివేదిక తుది ప్రచురణ
15 నుంచి 46 గ్రామాల్లో రెండో విడత భూముల రీసర్వే
కలెక్టరేట్(కాకినాడ), ఏప్రిల్ 10(ఆంధ్ర జ్యోతి): రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భూముల రీసర్వే క్రతువు కొలిక్కి వస్తోంది. తొలి విడతగా 48 గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించి రైతులకు నోటీసులు జారీచేశారు. ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లాలో తొలి విడత (పైలెట్ ప్రాజెక్ట్)గా 48 గ్రామాల్లో భూ ముల రీసర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దీనిలో కాకి నాడ జిల్లాలో 15 గ్రామాల్లో, కోనసీమ జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 16 గ్రామాల్లో రీసర్వేకు ఎంపిక చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వ హించిన తొలి విడత సర్వేలో మూడు నెలలపాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు అధికార బృందాలు పాల్గొన్నాయి. 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా విభజించి సర్వే చేశారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని బట్టి నాలుగు బృందాలుగా విభజించారు. ఇద్దరు సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్‌ఏలు ఒక బ్లాక్‌ను సర్వే చేశారు. ఇలా బృందాలు నిత్యం రీసర్వేలో పాల్గొన్నాయి. గత వైసీపీ ప్రభు త్వంలో ఆదరాబాదరాగా భూముల సర్వే చేశారు. ఈ నేపథ్యంలో భూముల విస్తీ ర్ణం తగ్గిందని, హద్దులు మార్చేశారని, హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయని పెద్దఎత్తున రైతులు అధికారులకు ఫిర్యా దులు చేశారు. దీంతో రాష్ట్రప్రభుత్వం భూముల రీసర్వేకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూముల రీసర్వే నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో...
కాకినాడ జిల్లాలో తొలి విడతలో 15 గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించారు. దీనిలో వేట్లపాలెం, కోలంక, కుమారపురం, పటవల, యల్లమిల్లి, జె.కొత్తూరు, ఎస్.తిమ్మాపురం, బోదవరం, కట్టమూరు, పి.జగన్నాథపురం, ఆర్.వెంకటపురం, శంఖవరం, కృష్ణపురం, భద్రవరం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వ్యవసాయ పొలాలను రెవెన్యూ బృందాలు రీసర్వే నిర్వహించాయి. ఇటీవల 27 వేల మందికి 92 నోటీసులు జారీచేశారు. మరో 21 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో తొలి విడతలో 16 గ్రామాల్లో భూముల రీసర్వే చేశారు. 19 వేలమంది రైతులకు నోటీసులు జారీచేశారు. క్షేత్రస్థాయిలో భూముల సరిహద్లు కొలిచి ఏ మేరకు హక్కు పత్రాల్లో ఉన్నాయో గుర్తించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలి విడతలో 17 గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించారు. దీనిలో జొన్నాడ, వాడపల్లి, కొడగట్లపల్లి, ఓడరేవులపల్లి, భీమక్రోసుపాలెం, ముమ్మిడివరప్పాడు, అప్పన్నరామునిలంక, మట్టపర్రు, గాడిలంక, పశువులంక, ఉప్పలగుప్తం, ఎంట్రికోన, కందికుప్ప, నందంపూడి, వానపల్లి గ్రామాల్లో రీసర్వే నిర్వహించారు. 5,280 మంది రైతులకు 92 నోటీసులు జారీచేశారు.
తొలి విడత రీసర్వే నివేదిక
తొలి విడత భూముల రీసర్వే నోటీసు లకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నివేదిక తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీ వో లాగిన్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ల లాగిన్‌కు వెళు తుంది. జాయింట్ కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి అభ్యంత రాలు లేని రీసర్వే నివేదికను తుది ప్ర చురణ చేసి ఆమోదిస్తారు. ఈ నేపథ్యం లో రైతులు ఎంతోకాలంగా పరిష్కారం కాని భూముల హద్దులు, దొర్లిన తప్పుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించనుంది.
15 నుంచి రెండో విడత..
ఈనెల 15 నుంచి ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో 46 గ్రామాల్లో రెండో విడత భూముల రీసర్వేకు యంత్రాంగం సిద్ధమ వుతోంది. దీనిలో కాకినాడ జిల్లాలో 14 గ్రా మాల్లో, కోనసీమ జిల్లాలో 15 గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 17 గ్రామాల్లో రీ సర్వేకు సర్వం సిద్ధమైంది. రెవెన్యూ బృందా లుదరఖాస్తులకు పరిష్కారం
గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులు నిండా మునిగారు. ఈ పది నెలల కాలంలో మూడు జిల్లాల్లో నిర్వహించిన గ్రామసభలకు, కలెక్టరేట్‌లకు వేలాది సం ఖ్యలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులూ తీవ్ర ఒత్తి డికి గురయ్యారు. ప్రభుత్వం రీసర్వేకు ఆదే శించడంతో రైతులకు ఊరట కలగనుంది., సర్వేయర్ల బృందాలను అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.