కన్నేసి.. స్థలం కబ్జా చేసి!
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:08 AM
రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (ఆంధ్ర జ్యోతి): స్థలం కాజేసిన ఐదుగురిని రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య మంగళవారం వెల్లడించా రు. తూర్పు గోదావరి జిల్లా రాజ మహేంద్రవరంలో గొల్లపల్లి కాశీ విశాలాక్షి వైద్యురాలిగా పనిచేస్తుం డేవారు. 1997లో తన కుమారులు గొల్లపల్లి వినోద్, గొల్లపల్లి లక్ష్మణ్ పేరున కవలగొయ్యి గ్రామ పరిధి లోని ఎస్‌ఆర్ నెం.496లో ప్లాటు నెం.39 ద్వారా 267చదరపు
రాజమహేంద్రవరంలో ఐదుగురి అరెస్ట్
రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (ఆంధ్ర జ్యోతి): స్థలం కాజేసిన ఐదుగురిని రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య మంగళవారం వెల్లడించా రు. తూర్పు గోదావరి జిల్లా రాజ మహేంద్రవరంలో గొల్లపల్లి కాశీ విశాలాక్షి వైద్యురాలిగా పనిచేస్తుం డేవారు. 1997లో తన కుమారులు గొల్లపల్లి వినోద్, గొల్లపల్లి లక్ష్మణ్ పేరున కవలగొయ్యి గ్రామ పరిధి లోని ఎస్‌ఆర్ నెం.496లో ప్లాటు నెం.39 ద్వారా 267చదరపు గజాలు.. దివాన్‌చెరువు పంచాయ తీ పరిధిలో ప్లాట్ నెం.204లో వినోద్ పేరున 267చ.గ., లక్ష్మణ్ పేరున ప్లాట్ నెం.203లో 267 చదరపు గజాల స్థలాన్ని కొన్నారు. ఆమె భర్త 20 12లో మరణించడంతో తన స్వగ్రామం ఆకివీడు మండలం కుప్పనపూడి వెళ్లిపోయారు. తర్వాత కుమారులు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరప డ్డా రు. విశాలాక్షి కూడా అమెరికా వెళ్లారు. ఇటీ వల స్వగ్రామం వచ్చి స్థలాలను ఒకసారి పరిశీలి ం చుకుందామని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లా రు. అవి వేరొక వ్యక్తులకు క్రయంగా దాఖలు పడ్డాయని తెలియడంతో అవాక్కయ్యారు. దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయని గ్రహించి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో సీఐ కాశీ విశ్వనాథ్ టీం దర్యా ప్తు ప్రారంభించింది. దీంతో పలు విషయాలు వె లుగు చూశాయి. రియల్ ఎస్టేటు బ్రోకర్లుగా ఉ న్న మద్దిరెడ్డి లక్ష్మీ నారాయణ, మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్(సిటీ బస్సు ప్రసాద్)కి 2013 జనవరిలో షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఏవైనా ఎక్కువ కాలం ఖా ళీగా ఉన్న స్థలాలను గుర్తించి తన దృష్టికి తెస్తే నకిలీ దస్తావేజులు తయారు చేసి అమ్ముకోవచ్చ ని, అధిక మొత్తంలో సొమ్ము వస్తుందని చెప్పా డు. వాళ్లు తమకు తెలిసిన రియల్ ఎస్టేటు వ్యాపారుల నుంచి విశాలాక్షి కుమారులకు సంబ ంధించిన ప్లాట్ల దస్తావేజు జిరాక్సులను తీసుకెళ్లి ఖాసింకి ఇచ్చారు. అతడు నకిలీ జిరాక్సు కాపీ లతో ఒరిజినల్ దస్తావేజులను తయారు చేయిం చాడు. రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్ట్రేషను స మయ ంలో ధవళేశ్వరానికి చెందిన పాతూరి ప్రసాద్, సబ్బితి భాస్కరరావుకు రూ.20వేల చొప్పున ఇచ్చి వినోద్, లక్ష్మణ్‌గా నటింపజేసి రిజిస్ట్రేషను ప్రక్రి య పూర్తి చేశారు. రిజిస్ట్రారు కార్యాలయంలో ఏ విధంగా నడుచుకోవాలనే విషయంపై కొవ్వూరు కు చెందిన యాదగిరి సురేశ్, గాలి రాజేంద్ర ప్రసాద్‌తో తర్ఫీదు ఇప్పించారు. నకిలీ ఓటర్ ఐడీ కార్డులు, దస్తా వేజులతో మరికొందరితో కలిసి నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆపై వేరొకరికి విక్రయించేశారు. ఈ కేసులో షేక్ ఫకీర్ మహ మ్మద్ ఖాసీం బాషా, మద్దిరెడ్డి లక్ష్మీ నారాయణ, మద్దిరెడ్డి నాగేంద్రప్రసాద్, సబ్బితి భాస్కరరావు, యాదగిరి సురేశ్‌ని అరెస్టు చేశామని, మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివ రించారు. ఖాళీ స్థలం కనబడితే కర్చీఫ్ వేసి కాజేస్తామంటే ఉపేక్షించేది లేదని, కబ్జా వ్యవ హారాలపై పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ నర సింహ కిషోర్ తెలిపారు. ఎక్కువ కాలం తమ స్థలాలను పట్టించుకోకుండా ఉండడం సరికాద ని, పరిశీలించుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. అయితే రిజిస్ట్రేషను ఎలా జరిగిందనే అంశంపై విమర్శలు, అప్పటి సబ్-రిజిస్ట్రారుపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినవస్తున్నాయి.