పర్యాటక శాఖకు 116 ఎకరాలు, వ్యవసాయ కళాశాలకు 10 ఎకరాలు కేటాయింపు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:38 AM
రాజమహేంద్రవరం రూరల్ మం డలం ధవళేశ్వరంగ్రామ పరిధిలోని సర్వేనెంబరు 386/6లో గల 10.72 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని వ్యవసాయ కళాశాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 92ను జారీ చేసిం ది.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 12( ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రూరల్ మం డలం ధవళేశ్వరంగ్రామ పరిధిలోని సర్వేనెంబరు 386/6లో గల 10.72 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని వ్యవసాయ కళాశాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 92ను జారీ చేసిం ది. మంగళగిరి కమిషనర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ పరిధిలోని భూమిని రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు ఉచి తంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తదుపరి చర్యలు నిమిత్తం జీవోను జారీచేసి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు శివారు గామన్ బ్రిడ్జి రోడ్డులోని కళాశాల నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వం జీవో 90 పేరుతో మరో ఉత్తర్వుని కూడా విడుదల చేసింది. దీని ప్రకారం.. రాజమహేంద్రవరం గోదావరి బ్రిడ్జిలంకలోని 116.974 ఎకరాల లంక భూమిని పర్యాటక శాఖకు అభివృద్ధి నిమిత్తం కేటాయించింది.