ఫేస్‌బుక్ పరిచయం...రూ.14.95 లక్షలు మాయం..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:51 AM
రాజానగరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ధనవంతుడిని చేస్తానని ఓ అమ్మాయి పలికిన మాయమాటల వలపుల వలలో చిక్కుకుని వ్యక్తి నిలువునా మోసపోయాడు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృ ష్ణపట్నం గ్రామానికి చెందిన కొల్లం బాబుకు ఓ అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా పరిచయ మైంది. ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. బాబును ధనవంతుడిని చేస్తానని ఆశచూపింది. ఆ తర్వాత ఆమె కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు ఇచ్చి
ధనవంతుడిని చేస్తానని మోసం చేసిన యువతి
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
రాజానగరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ధనవంతుడిని చేస్తానని ఓ అమ్మాయి పలికిన మాయమాటల వలపుల వలలో చిక్కుకుని వ్యక్తి నిలువునా మోసపోయాడు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృ ష్ణపట్నం గ్రామానికి చెందిన కొల్లం బాబుకు ఓ అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా పరిచయ మైంది. ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. బాబును ధనవంతుడిని చేస్తానని ఆశచూపింది. ఆ తర్వాత ఆమె కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు ఇచ్చి సొమ్మును వాటికి ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయమని చెప్పింది. ఈ విధంగా తొలుత రూ.50 వేలు ఫోన్ పే ద్వారా ఆమెకు పంపిన బాబు. దఫదఫాలుగా రూ.14,95,135ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. బాబు సొమ్మును ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసిన వెంటనే ట్రేడింగ్ ఖాతాలో బాధితుడికి డాలర్ల రూపంలో 5903.57 క్రెడిట్ అయినట్టు చూపించేదని ఫిర్యాదులో పేర్కొ న్నాడు. ఈ సొమ్మును విత్‌డ్రా చేసి తన ఖాతాకు వేయమని తిరిగి బాబు అడగ్గా తన ఎక్కౌంట్ ఫ్రీజ్ అయ్యిందని, మరో రూ.20 లక్షలు చెల్లించమని చెప్పిన ఆమె ఆ తర్వాత ఆ వ్యక్తి నెంబరు బ్లాక్ చేసింది. దీంతో తనను నమ్మించి మోసం చేసినట్టుగా గుర్తించిన బాబు తనకు న్యాయం చేయాలంటూ రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నాగార్జున తెలిపారు.