Share News

కొవ్వూరులో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:20 AM

కొవ్వూరు నియోజకవర్గ జనసైనికులతో జనసేన రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్‌ సమావేశమయ్యారు.

కొవ్వూరులో ఏం జరుగుతోంది?
జన సైనికులతో మాట్లాడుతున్న జనసేన రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌

కొవ్వూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కొవ్వూరు నియోజకవర్గ జనసైనికులతో జనసేన రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్‌ సమావేశమయ్యారు. ఇటీవల జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ.రామారావు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు గౌరవం లభించడం లేదని, రోడ్డు కం రైలు వంతెన టోల్‌గేటు వద్ద నిరసన దర్నాచేపట్టారు. దీంతో పార్టీ అధిష్ఠానం కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని టీవీ.రామారావుని ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించా రు. జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ను జనసేనాని పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం కొవ్వూరు జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో శివశంకర్‌ సమావేశమయ్యారు. అనంతరం మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులు,సీనియర్‌ నా యకులతో సమావేశమై ఆరా తీశారు.

Updated Date - Jul 15 , 2025 | 01:20 AM