Share News

కొత్తపేట ఎమ్మెల్యే బండారుకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:23 AM

ఆలమూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులో బుధవారం రైతులు నిర్వహించిన రైతు సంబరాల కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. చొప్పెల్ల నుంచి ఆలమూరుకు చేరుకున్న ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం

కొత్తపేట ఎమ్మెల్యే బండారుకు తృటిలో తప్పిన ప్రమాదం
ఆలమూరులో ఎడ్ల బండిపై ఎమ్మెల్యే, నాయకులు

ఆలమూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులో బుధవారం రైతులు నిర్వహించిన రైతు సంబరాల కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. చొప్పెల్ల నుంచి ఆలమూరుకు చేరుకున్న ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం ఎడ్లబళ్లను ఏ ర్పాటు చేశారు. ఎడ్ల బండిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతోపాటు నాయకులు ఆకుల రా మకృష్ణ, ఈదల సత్తిబాబు, చిలువూరి సతీష్‌రాజు పలువురు ఉన్నారు. అక్కడ ఏర్పడిన శబ్దానికి ఒక్కసారిగా ఎడ్ల భయపడి గంతులు చేయడంతో బండి వెనుకకు తిరగబడింది. దీంతో బండిపై ఉన్న నాయకులు ఒక్కసారిగా కిందపడ్డారు. అయితే ఎమ్మెల్యే బండారు బండికి ఉన్న కొయ్యను గట్టిగా పట్టుకోవడంతో కిందపడకుండా ఉండిపోయారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. సతీష్‌రాజు, రామకృష్ణ, సత్తిబాబుతో పా టు పలువురికి గాయాలయ్యాయి.

మంత్రుల పరామర్శ

కొత్తపేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆలమూరులో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావును రాష్ట్ర ఐటీ మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌, వ్యవసాయ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కె.అచ్చెన్ననాయుడు ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి తీ సుకోవాలని సూచించారు. అలాగే జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు బం డారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఎటువంటి సమస్యలు ఉత్పన్న ం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Aug 14 , 2025 | 01:23 AM