కోట సత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:01 AM
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ఆరంభ మయ్యాయి.
నిడదవోలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ఆరంభ మయ్యాయి. వైదిక స్మార్త ఆగమ ఆచారం ప్రచారం దేవులపల్లి వంశస్తులు కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచ నం, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన,మహాలింగార్చన, సూర్యనమస్కారాలు, మహాన్యాస పఠనం, అనంతరం కోట సత్తెమ్మ అమ్మవారు ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రఽధాన అర్చకుడు అప్పారావుశర్మ ఆధ్వర్యంలో మహానివేదన, నీరాజన మంత్ర పుష్పాలు జరిగాయి. దే వులపల్లి రవిశంకర్ దంపతులు, దేవులపల్లి వంశస్థులు పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక స్వర్ణాభరణాలతో, ప్రత్యేక పూల అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని తీర్ధపస్రాదాలు స్వీకరించారు.ఈ నెల 8వ తేదీ వరకూ ఉత్సవాలు జరు గుతాయని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. తెలిపారు.