Share News

ఆపదమొక్కుల ‘వాడ’పల్లి!

ABN , Publish Date - May 04 , 2025 | 01:14 AM

ఉన్నావా అసలున్నావా.. ఉంటే కళ్లుమూసుకున్నావా.. భక్తతుకారాం సినిమాలో పాట ఇది.. నిన్న మొన్నటి వరకూ చాలామంది అభిప్రాయం కూడా ఇదే.. దేవుడు లేడనేది వాదన.. ఈ అభిప్రాయం తప్పని.. నేనున్నానని నిరూపించాడు.. వాడపల్లి వేంకటేశ్వరుడు. ్ఞఅందుకే ఆయనను నిదర్శనమూర్తిగా కొలుస్తారు.

ఆపదమొక్కుల ‘వాడ’పల్లి!

  • ఏడు వారాల వెంకన్నగా వినుతి

ఉన్నావా అసలున్నావా.. ఉంటే కళ్లుమూసుకున్నావా.. భక్తతుకారాం సినిమాలో పాట ఇది.. నిన్న మొన్నటి వరకూ చాలామంది అభిప్రాయం కూడా ఇదే.. దేవుడు లేడనేది వాదన.. ఈ అభిప్రాయం తప్పని.. నేనున్నానని నిరూపించాడు.. వాడపల్లి వేంకటేశ్వరుడు. ్ఞఅందుకే ఆయనను నిదర్శనమూర్తిగా కొలుస్తారు. నిజానికి 2009 వరకు ఆ స్వామిని కొలిచేవారే అరుదు.. కల్యాణోత్సవాల సమయంలో తప్ప ఆ స్వామి చెంత సందడే ఉండేది కాదు.. మరి నేడు.. ప్రతి వారం లక్షలాదిగా భక్తులను తన చెంతకు రప్పించుకుని కోరిన కోర్కెలు తీర్చే ఆపదమొక్కుల వాడిగా వినుతికెక్కారు.. అమెరికా.. ఆస్ట్రేలియా.. తదితర దేశాల నుంచి భక్తులు వస్తున్నారంటే ఆ స్వామి దయ కాకపోతే మరేమిటి.. కోరిన కోర్కెలు తీరుస్తాడనే నమ్మకమే వాడపల్లికీ మహర్దశ.

దేవుడున్నాడు.. భక్తజనం కోర్కెలు తీరుస్తున్నాడు.. అందుకే ఒక్కటా రెండా ఏకంగా ప్రతి శనివారం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు ఆ స్వామిని చూసేందుకు ఎక్క డెక్కడి నుంచో వస్తు న్నారు. స్వామిని దర్శిం చుకుని వెళుతున్నారు. ఒకనాడు ఎక్కడ ఉందో తెలియని వాడపల్లి.. వేంకటేశ్వరుడి ఊరుగా తిరుమల అంత ప్రసిద్ధి కెక్కింది. గౌతమి నదీ తీరాన పచ్చని పంటపొలాల నడుమ వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తజన గోవిందనామస్మరణతో విరాజిల్లుతుంది. సుమారు 15 ఏళ్ళ కిందట ఏడాదికోమారు స్వామి ఉత్సవాలు చేయా లంటేనే కష్టం.. అటువంటి స్థితి నుంచి నేడు తిరుమల తరహాలో ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అలనాడు వందల్లో భక్తులుంటే నేడు ఆ సంఖ్య వేలకు చేరింది. ఓ భక్తుడు సొంత విమానంలో వచ్చి స్వా మిని దర్శించుకుని రూ.కోటి విరాళం అందిం చి వెళ్లారంటే స్వామి ఎంత మహిమాన్వి తుడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత స్వామి వార్షికాదాయం రూ.32 కోట్లకు చేరుకుంది.

స్వామి వెలిశారిలా..

విష్ణుమూర్తి ఒకప్పుడు నౌకాపురిగా పిలిచే వాడపల్లిలో వెలుస్తానంటూ అభయమిచ్చాడట.. కొంత కాలానికి గోదావరిలో ఒక పెట్టె కొట్టుకువచ్చింది.. ఒక వృద్ధుడికి స్వామి కలలో కనిపించి ఆ చందన పెట్టె గురించి తెలియ జేశాడట.. మరునాడు పెట్టి తీసి తెరిస్తే ఎర్రచందనంతో చెక్కిన స్వామి దివ్య మంగళమూర్తి కనిపించిందట. ఇది తెలిసి నారదుడు స్వామికి వేంకటేశ్వరుడు అని నామకరణం చేసి ఆలయాన్ని నిర్మించాడని పురాణ కథనం.

ఎర్రచందనం కొయ్యతో స్వామి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయం భూ ఎర్రచందన కొయ్య విగ్రహంతో మూర్తీభవించిన స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. దేవతామూర్తుల విగ్రహాలను శిలతో తయారు చేస్తే స్వామి మాత్రమే ఎర్రచందనంతో మూర్తీభవించారు.

2009 నుంచి.. 7 ప్రదక్షిణలు..

2009 మార్చి 23న అప్పటి ఈవో, సిబ్బంది ఏడు వారాల వెంకన్న దర్శనం...ఏడేడు జన్మల పుణ్యఫలంగా స్వామి ఖ్యాతిని ఇనుమడింప జేశారు.. అక్కడి నుంచి స్వామి వెనుతిరిగి చూసుకోలేదు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా అంచలంచెలుగా వినుతికెక్కారు. ఏడు శనివారాలు.. స్వామివారి ఆలయంలో ఏడు ప్రదక్షణలు నిర్వహిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరావడంతో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తిరుమల తరహాలో పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు, గోదాదేవి కల్యాణం కోట్లాది రూపాయలతో నిర్వహిస్తున్నారు. నిత్యం ఆలయంలో ఐశ్వర్యలక్ష్మీ హోమం, నిత్యకల్యాణం, అష్టోత్తర పూజలు చేస్తారు.

నాడు వడ్డికాసులవాడే..

2009కి ముందు స్వామి వార్షికాదాయం రూ.18 లక్షలు ఉండేది. ప్రతి ఏటా మార్చి నెలలో స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో అప్పటి ఈవో, సిబ్బంది రూ.3 లక్షల వరకూ అప్పు తెచ్చేవారట. అనంతరం శిస్తును వసూళ్లు చేసి స్వామి కల్యాణం అప్పులు తీర్చే వారు. ప్రస్తుతం 6-ఏ నుంచి డిప్యూటీ కమిషనరు స్థాయికి ఈ క్షేత్రం చేరుకుంది. వార్షికా దాయం రూ.18 లక్షల నుంచి నేడు రూ.32 కోట్లకు చేరుకుంది. 2023లో డీసీ హోదా దక్కించుకున్న ఈ క్షేత్రం 2026లో రీజనల్‌ జాయింట్‌ కమిషనరు హోదాకు చేరుకోనుంది. ఆలయంలో 310 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఏటా జీతభత్యాల కింద రూ.6.32 కోట్లు చెల్లిస్తున్నారు.

భూములు.. 116 ఎకరాలు

తిరుమల తరహాలో స్వామికి దాతలు బంగారు విరాళాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం స్వామివారికి 7.421 కిలోల బంగారం ఉంది. వెండి 183.339 కిలోలు ఉంది. స్వామికి 406 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 116 ఎకరాలు మాత్రమే ఆధీనంలో ఉంది. దీని ద్వారా రూ.35 లక్షల ఆదా యం వస్తుంది. మిగిలిన భూమి అన్యాక్రాంతమైనట్టు తెలిసింది.

నిత్యాన్నదానం

నిత్యాన్న దానం ఉంది. ప్రతి నెలా 1.50 లక్షల మంది భక్తులు స్వామి ప్రసాదం స్వీకరి స్తారు.రూ.40 లక్షలు ఖర్చవుతుంది. అన్నప్ర సాదానికి రూ.11.09 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. రూ.120 కోట్లతో కేంద్రం అందించే ప్రసాద స్కీమ్‌కు ప్రతిపాదనలు చేసి నట్టు ఉపకమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

ఆదాయం రూ.39 కోట్లు

ఏడాది ఆదాయం ఖర్చులు(కోట్లలో)

2021-22 రూ.9.36 రూ. 8.68

2022-23 రూ.18.82 రూ.18.14

2023-24 రూ.28.88 రూ. 26.53

2024-25 రూ.39.09 రూ. 32.01

ఫిక్సిడ్‌ డిపాజిట్లు రూ.3.65 కోట్లు

సేవింగ్స్‌ ఖాతాలో సుమారు రూ.5కోట్లు

- ఆత్రేయపురం

Updated Date - May 04 , 2025 | 01:14 AM