రైతులారా తెలుసుకోండి! రాయితీలు పొందండి
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:50 AM
ఉద్యా నశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీతో కూడిన వివిధ పథకాలను అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవా లని ఉద్యానశాఖాధికారి అల్లం నాగదేవిశ్రీ పేర్కొ న్నారు. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయి ల్స్-ఆయిల్ పామ్(ఎన్‌ఎంఈవో-ఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు మొక్కలు పూర్తి ఉచితం
కోకో, కొబ్బరి పండ్లు, కాయ, కూర తోటల సాగుకు సబ్సిడి
అంతర పంటలకూ వర్తింపు
రాజానగరం, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఉద్యా నశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీతో కూడిన వివిధ పథకాలను అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవా లని ఉద్యానశాఖాధికారి అల్లం నాగదేవిశ్రీ పేర్కొ న్నారు. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయి ల్స్-ఆయిల్ పామ్(ఎన్‌ఎంఈవో-ఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఒక హెక్టారుకు 143 మొక్కలు అవసరమవుతా యని, ఒక మొక్క ఖర్చు రూ.193 కాగా, ప్రభు త్వం నూరు శాతం రాయితీపై అందజేస్తుంద న్నారు. మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల్లో మొక్కల మధ్య మొక్కజొన్న, మినుములు, బొ ప్పాయి, అరటి, కూరగాయలను అంతర పంట లు వేసుకోవచ్చన్నారు. అంతర పంటలకుగానూ ఏడాదికి రూ.5,250 ఒక హెక్టారుకు.. నాలుగు ఏళ్లకు రూ.21 వేలు రాయితీ అందజేస్తున్నామ న్నారు. అలాగే ఎరువులు, పురుగు మందులకు గానూ ఏడాదికి రూ.5,250 హెక్టారుకు నాలుగేళ్ల కు రూ.21 వేలు రాయితీ అందజేస్తుందన్నారు. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్(సీడీబీ)ద్వారా కొ బ్బరి సాగు రైతులకు రాయితీ అందజేస్తుంద న్నారు. మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్‌కేవీవై) ద్వారా పండ్ల తోట లైన మామిడి, జీడి మామిడి, బొప్పాయి, జామ, నిమ్మ, టిష్యూ కల్చర్ అరటి, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరిలో కోకో (ఒక రైతు 5 ఎకరాల వరకు), పూల తోటలు బంతి, గులాబీ, చామంతి, లిల్లీ, మల్లె (ఒక రైతు 2.5 ఎకరాలు వరకు)రాయితీ పొందవచ్చన్నారు. చిన్న, సన్న కారు రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్)లో పండ్ల, పూల తోటల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కూరగాయలు పండించే రైతులు హైబ్రిడ్ కూర గాయల విత్తనం(ఒక ఎకరానికి రూ.1200), హై బ్రిడ్ కూరగాయల పెంపకం(ఒక ఎకరానికి రూ.8 వేలు)వరకు రాయితీ పొందవచ్చన్నారు. తీగ జాతి కూరగాయలు పండించే రైతులు శా శ్వత పందిరిలో వేసుకోవడానికి ఎకరానికి రూ.లక్ష రాయితీ కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ)లో డ్రిప్‌కి చిన్న, సన్న కారు రైతులు ఎస్సీ, ఎస్టీకి చెందిన వారికి (5 ఎకరాల లోపు) నూరు శాతం రాయి తీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. చిన్న, సన్న కారు రైతులు ఎస్సీ, ఎస్టీ మినహాయించి 90శాతం రాయితీ(ఐదు ఎకరాల లోపు)రాష్ట్ర ప్ర భుత్వం అందజేస్తుందన్నారు. ఐదు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకు 70శాతం రాయితీ, 12.30 ఎకరాలు పైబడిన ఉన్న వారికి 50శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. అలాగే అన్ని వర్గాల వారికి 50శాతం రాయితీపై స్ర్పింక్లర్లు అందిస్తున్నామని, ఈ రాయితీలను రైతులు అందిపుచ్చుకుని వ్యకసాయాన్ని విస్తరించుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్యానశాఖాధికారి నాగదేవి శ్రీ పేర్కొన్నారు.
రైతుల్లో అవగాహన కల్పిస్తాం
ఉద్యానశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేస్తున్న రాయితీ పథకాలపై గ్రామ స్థాయి లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించే యోచన ఉందని మండల ఉద్యాన శాఖ అధికారి అల్లం నాగదేవిశ్రీ అన్నారు. తన పరిధిలోని రాజానగరం మండలంలో 16 వేల ఎకరాలు, రంగంపేటలో 13 వేలు, బిక్కవోలులో 3 వేలు, అనపర్తిలో 2 వేల ఎకరాల్లో మామిడి, జీడిమామిడి, ఆయిల్ పామ్, నిమ్మ తదితర పంటలు సాగు చేస్తున్నారన్నారు.. ఆయా పంటలపై ప్రభుత్వం అందిస్తు న్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.