Share News

పెళపెళ.. వరుస ఊచకోత!

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:37 AM

పక్కలో బళ్లెం, పొట్ట మధ్య లోపల నుంచి బళ్లెంతో పొడవడం, జబ్బపై కత్తితో నరకడం, పొట్ట లోపల నుంచి కత్తితో పొడవడం, వినాయకుడి వేషంలో నరకాసురున్ని వధించడం, రంపంతో కోయడం వంటి ఒళ్లు గగుర్పాటు కలిగించే వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చి కళాకారులు ఆకట్టుకున్నారు.

పెళపెళ.. వరుస ఊచకోత!
కొత్తపల్లి మండలం మూలపేటలో గౌరీదేవి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రదర్శిస్తున్న కత్తిపోటు వేషధారణ

  • గగుర్పాటు కలిగించేలా కత్తిపోటు వేషధారణల ప్రదర్శన

  • కొత్తపల్లి మండలం మూలపేటలో గౌరీదేవి ఉత్సవాల ముగింపులో ఆకట్టుకున్న కళాకారులు

పక్కలో బళ్లెం, పొట్ట మధ్య లోపల నుంచి బళ్లెంతో పొడవడం, జబ్బపై కత్తితో నరకడం, పొట్ట లోపల నుంచి కత్తితో పొడవడం, వినాయకుడి వేషంలో నరకాసురున్ని వధించడం, రంపంతో కోయడం వంటి ఒళ్లు గగుర్పాటు కలిగించే వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చి కళాకారులు ఆకట్టుకున్నారు.

కొత్తపల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో గౌరీదేవి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ప ట్టుసాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవా రం ఈ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిఏటా కార్తీక పౌర్ణమి తర్వాత గౌరీదేవిని ఆలయంలో ప్రతి ష్టించి విశేషపూజలతో అంగరంగ వైభవంగా ముగింపుఉత్సవాలు నిర్వహించడం మూలపే టలో ఆనవాయితీగా వస్తోంది. కత్తిపోటువేషా ల ప్రదర్శన ఖర్చుతో కూడినది కావడంతో మూడేళ్లకు ఒకసారి జరుపుతుంటామని నిర్వా హకులు తెలిపారు. కొత్తపల్లి గాజులదొడ్డిలో ముగింపు ఉత్సవాలను బ్యాండ్‌ మేళాలతో, తీ న్మార్‌ ప్రదర్శనలతో వైభవంగా నిర్వహించారు.

Updated Date - Nov 08 , 2025 | 01:37 AM