వాటర్ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:11 AM
యానాం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యానాం శివారు కనకాలపేటలో ప్రజాపనుల శాఖ ద్వారా పరిసరర ప్రాంత ప్రజలకు తాగునీటిని శుద్ధి చేసి సరఫరా చేసే వాటర్ ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా క్లోరిన్ గ్యాస్ ట్యాంక్ లీకైంది. దీంతో అధికారులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటప్రాంతానికి చేరుకుని క్లోరిన్ లీకైన ప్రాం
యానాంలో సంఘటన
200 మీటర్ల వరకు వ్యాప్తి
15 మందికి అస్వస్థత
ఆసుపత్రికి తరలింపు
యానాం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యానాం శివారు కనకాలపేటలో ప్రజాపనుల శాఖ ద్వారా పరిసరర ప్రాంత ప్రజలకు తాగునీటిని శుద్ధి చేసి సరఫరా చేసే వాటర్ ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా క్లోరిన్ గ్యాస్ ట్యాంక్ లీకైంది. దీంతో అధికారులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటప్రాంతానికి చేరుకుని క్లోరిన్ లీకైన ప్రాంతంలో వాటర్ స్పే చేయడంతో వారిలో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయారు. 200 మీటర్ల వరకు క్లోరిన్ వ్యాప్తి చెందడంతో అందరూ మాస్క్‌లు ధరించారు. అక్కడే ఉన్న ప్రజాపనులశాఖ ఈఈ నాగరాజు, జేఈలు సంతోష్, బోడ్డు ప్రసాద్‌తో పాటు ఫైర్‌సిబ్బంది అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఏ అంకిత్‌కుమార్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పరిస్థితిపై సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తక్షణం కనకాలపేటలో వైద్యసిబ్బంది, అంబులెన్సు సర్వీస్‌లను ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమీప ప్రాంతంలో ఉన్నవారు వికారం, వాంతులు, తల తిరగడం, ఊరిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడ్టారు. ఇది కేవలం సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరిగినట్టు తెలిసింది. క్లోరిన్ గ్యాస్ అయిపోయిందా లేదా అనేది పరిశీలించేందుకు తెరవడంతో దాంట్లో ఉన్న క్లోరిన్ ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతోనే ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది, స్థానికులు 15మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే, ఆర్‌ఏ తెలిపారు. పుదుచ్చేరిలో ఉన్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గ్యాస్ లీకేజీ సంఘటనకు సంబంధించి పుదుచ్చేరి ప్రజాపనులశాఖ ఎస్‌ఈ వీరసేల్వతో చర్చించారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వీడియోకాల్‌లో పరామర్శించారు. అలాగే బాధితు లను ఎన్‌ఆర్ కాంగ్రెస్ యానాం శాఖ అధ్యక్షుడు మల్లాడి సామ్యూల్, వ్యాపార వేత్త తోట రాజు పరామర్శించారు.