కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:20 AM
రంపచోడవరం/దేవీపట్నం, ఆగస్టు 10(ఆం ధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సోయం శ్రీ సౌమ్యను ఈ నెల 7న ఉదయం 10, 11 గంటల మధ్యలో ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి కిడ్నాప్ చేసిన ఘటనలో ప్రధా
సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సురక్షితం
రంపచోడవరం/దేవీపట్నం, ఆగస్టు 10(ఆం ధ్రజ్యోతి): అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సోయం శ్రీ సౌమ్యను ఈ నెల 7న ఉదయం 10, 11 గంటల మధ్యలో ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి కిడ్నాప్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రత్యేక పోలీసు బృందం గుర్తేడు వద్ద ఏ1 నిందితుడైన కశీంకోట అనిల్‌కుమార్, ఏ2 కళ్యాణం ఉమా మహేష్, ఏ3 రాగోలు దుర్గ విఘ్నేష్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, బాధి తురాలని సురక్షింతంగా రక్షించామని పేర్కొ న్నారు. ఏ1 అనిల్‌కుమార్‌పై ఎన్డీపీఎస్ కేసుల తో సహా క్రిమినల్ చరిత్ర ఉన్నట్టు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.