ఖరీఫ్..సా..గు!
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:42 AM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగుకు రైతాంగం సన్నద్ధమైంది. జూన్1నే కాలువలకు నీరు విడుదల చేయడంతో రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు.తొలకరి సేద్యం కోసం స్వేదం చిందించడానికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీబిజీ
వెదజల్లే సాగుపై ఆసక్తి.. వ్యవసాయ శాఖ ప్రణాళిక
పుష్కలంగా విత్తనాలు.. ఎరువులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగుకు రైతాంగం సన్నద్ధమైంది. జూన్1నే కాలువలకు నీరు విడుదల చేయడంతో రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు.తొలకరి సేద్యం కోసం స్వేదం చిందించడానికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ ప్రణాళికలకు అనుగుణంగా త్వరితగతిన ఖరీఫ్ సేద్యం పనులు చేపట్టాలనే యోచనలో ఉన్నారు. నారుమడి సిద్ధం చేయడం, నాట్లు వేయడం వంటి వాటిని నిర్ణీత సమయాల్లో పూర్తి చేస్తే రానున్న వర్షాలు, వరదల సమయానికి పంటను సంరక్షించుకోవచ్చుననే ఉద్దేశంతో ముందస్తు సాగుకు సిద్ధమయ్యారు.ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. తొలకరి వానలు మొదలుకావడంతో పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం గ్రామాలు వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి. నారుమ ళ్లు.. నాట్లు వంటి పనులతో రైతులంతా కుస్తీ పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 1.63 లక్షల ఎకరా ల్లో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు, వరదలను తట్టుకునే ఎంటీయూ 1318, 7029, 1064, పీఎల్‌ఏ 1100, ఎంటీయూ 1224 రకాల వంగడాల్ని నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరి నారుమడులను, జూలై నెలాఖరు నాటికి వరి నాట్లను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఖరీఫ్‌కు 35,277 క్వింటాళ్ల విత్తనాలు అవసరంగా అంచనా వేశారు. రైతుల వద్ద 22 వేలు క్వింటాళ్లు, డీలర్ల వద్ద 11 వేలు క్వింటాళ్లు, రాయితీపై మరో 1600 విత్తనాలను రైతులకు అందించనున్నారు. రైతులకు 42,493 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా 33, 800 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయశాఖ అధికారుల ప్రణాళికకు అనుగుణంగా ఖరీఫ్ సేద్యంలో స్వేదం చిందించేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు.
కాకినాడలో 90,300 హెక్టార్లలో...
కలెక్టరేట్(కాకినాడ), జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ఆరంభమయ్యాయి. ఈసీజన్‌లో 90,300 హెక్టార్లలో వరిసాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మరో పది వేల హెక్టార్లలో అపరాలు, మొక్కజొన్న, కాటన్ వంటివి సాగు చేయా లని నిర్ణయించారు. ఇప్పటి వరకు వంద హెక్టార్లలో వరి నారు మడులు వేశారు. మరో రెండు వందల హెక్టార్లలో దమ్ము పనులు పూర్తయ్యాయి. ఖరీఫ్‌కు సంబంధించి రైతులకు 45,939 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని తేల్చారు. రైతు నుంచి రైతుకు 22,200 క్వింటాళ్లు, రైతు సొంతంగా 18,375 క్వింటాళ్లు వరి విత్తనాలు కలి గి ఉన్నారు. ఏపీ సీడ్స్ వద్ద 2460 క్వింటాళ్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 4904 క్వింటాళ్లు విత్తనాలు ఉన్నాయి. విత్తనాలకు కొరత లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వెదజల్లు సాగు 36,120 హెక్టార్లలో చేయాలని వ్యవసాయశాఖ కార్యాచరణ అమలుచేస్తోంది. డెల్టాలో 7029, 1318, 1264 రకాల సాగుకు ఉప క్రమిస్తున్నారు. మెట్టలో అయితే బీపీటీ, ఆర్‌జీఎల్, ఆర్‌ఎన్‌ఆర్, ఓంసాయి, సంపద స్వర్ణ వంటి రకాల వరి విత్తనాలను రైతులు నాటుతున్నారు. అధిక దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో రైతులు ఈ రకాలను ఎంపిక చేసుకున్నారు. 90,300 హెక్టార్లలో వరి సాగుచేసి 5.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రైతులు సాధించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. వాతావరణం అను కూలిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని అధికారులు అంటున్నారు.
తూర్పున 80,918 హెక్టార్లలో..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025 పంటకాలానికి సంబంఽ దించి 80,918 హెక్టార్లలో సాగుకు ఉపక్రమిస్తున్నారు. 77,820 హె క్టార్లలో వరి, 2,595 హెక్టార్లలో మినప, 181 హెక్టార్లలో ప్రత్తి, వేరుశనగ వంటివి సాగుచేస్తారు. వరి పంటకు 38,910 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని తేల్చారు. ఇందులో 400 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు ప్రభుత్వం రాయతీపై అందిస్తోంది. జిల్లాలో 90 శాతం రైతు వారీ విత్తనాలే ఉంటాయి. 10 శాతం డీలర్ల నుం చి కొనుగోలు చేస్తారు. ఈసారి సన్నరకాలైన ఎంటీయూ 1224, బీపీటీ 2841, బీపీటీ 2270, బీపీటీ 2846, ఎన్‌ఎల్‌ఆర్ 3238 వంటి రకాలతోపాటు ఎంటీయూ 1318 వంటి నూతన రకం సాగుచేసే ఆదాయం ఎక్కువ ఉంటుందని అఽధికారులు అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు 64,157 మెట్రిక్ టన్నుల ఎరువులు అవ సరం. ఇప్పటివరకూ జిల్లాలో 24,258 మెట్రిక్ టన్నుల మేర ఎరువులు నిల్వ ఉన్నాయి. జిల్లా పంట సాగుదారు హక్కుల పత్రం (సీసీఆర్‌సి)కింద 1,10,000 కార్డులు పంపిణీ చేయవలసి ఉండగా 10,958 పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం వరికి సం బంధించి 76,941 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా, 3847 హెక్టార్ల నారుమళ్లు వేయాలి. ఇప్పటికి 882 హెక్టార్ల నారుమళ్లు వేశారు. 164 హెక్టార్లలో నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తు న్నారు. మరో 15 హెక్టార్లలో డ్రమ్ సీడింగ్‌తో సాగు ఆరం భించి నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు తెలిపారు.
అన్నదాత సుఖీభవ ఆలస్యం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
అన్నదాత సుఖీభవ పథకానికి అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. రైతులకు ఈ నెల 20వ తేదీన సొమ్ము లు విడుదల చేస్తామని ముం దస్తుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏ మెసేజ్ వచ్చినా ప్రభుత్వం నుంచి ‘సుఖీభవ’ మెసేజ్ వచ్చిందనుకొని రైతులు ఆతృత పడుతున్నాడు.వాస్తవానికి శుక్రవారం నుంచి ‘అన్న దాత సుఖీభవ’ డబ్బులు అర్హులైన రైతన్నల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. దీనిపై రైతులకు సరైన సమా చారం, స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ చూసి నా డబ్బుల జమ గురించే చర్చ నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 2.12 లక్షల మంది రైతులు ఉండగా 1.19 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఆన్ లైన్‌లో 1.14 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొదటి విడతలో భూ యజమా నులకు అన్నదాత సుఖీభవ అమలవుతుంది. కౌలు రైతులకు రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి అన్నదాత సుఖీభవ అమలు చేస్తుంది. ఈకేవైసీ పూర్తి చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న జాబితా మేరకు భూ యజమానులకు అమలు చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో రూ.13,500 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెం చింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వాటా కింద రూ.6వేలు ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలైలోపు ఒకటో ఫేజ్.. జూలై నుంచి నవంబరు రెండో ఫేజు, డిసెం బరు నుంచి మార్చి నెలాఖరులోపు మూడో సారి డబ్బులు జమ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిం చారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం యోగాంధ్రపై దృష్టి సారించింది. రాష్ట్రం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనే సంక ల్పంతో ఉండడంతో అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. దీంతో సుఖీ భవకు కాస్త ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.