సాహిత్యం, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహం అందించాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:21 AM
యానాం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): సాహి త్యం, కళా, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహం అందించాల్సిన ఆవశ్యకత ఉందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం యానాం అంబేడ్కర్ నగర్ కల్యాణమండపంలో కవిసంధ్య సాంస్కృతిక సంస్థ దశాబ్ది ఉత్సవం, శిఖామణి సాహిత్య పురస్కారాల ప్రదానం జరిగింది. కవిసంధ్య అధ్యక్షుడు కళారత్న డాక్టర్ శిఖామణి అధ్యక్షత
పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు
యానాంలో కవిసంధ్య దశాబ్ది ఉత్సవం
యానాం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): సాహి త్యం, కళా, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహం అందించాల్సిన ఆవశ్యకత ఉందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం యానాం అంబేడ్కర్ నగర్ కల్యాణమండపంలో కవిసంధ్య సాంస్కృతిక సంస్థ దశాబ్ది ఉత్సవం, శిఖామణి సాహిత్య పురస్కారాల ప్రదానం జరిగింది. కవిసంధ్య అధ్యక్షుడు కళారత్న డాక్టర్ శిఖామణి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా మల్లాడి మాట్లా డుతూ కవులు, రచయితలు సమాజాన్ని చైతన్య వంతం చేస్తారన్నారు. వారి రచనలు పుస్తక రూ పంలోకి తీసుకురావడానికి కొంతమంది ఇబ్బంది పడతారని, అటువంటి కవులకు ఆర్థికంగా ప్రో త్సాహం అందించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ముగ్గురు స్థానిక కవులకు, మరో ముగ్గులు ఆంధ్ర, తెలంగాణకు చెందిన కవులకు పుస్తకాల ముద్రణకు ఆర్థిక సహాయం, అలాగే కవిసంధ్య కార్యక్రమాలను తోడ్పాటు అందించనున్నట్టు తె లిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కవులు దాట్ల దేవదానం రాజు, వరుగు భాస్కరరెడ్డి, డానియల్ నెజర్స్, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ కాళ్లకూరి శైలజ, బొల్లోజు బాబా, కుంచే నాగసత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా క విసంధ్య-56 ఆరుద్ర భైరాగీ శత జయంతి సంచికను మల్లాడి కృష్ణారావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మ ండలి బుద్ద ప్రసాద్ రచించిన సదా స్మరణీయు లు సంచికను డెనియల్ నెజర్స్ ఆవిష్కరించారు.
శిఖామణి సాహితీ పురస్కారాల ప్రదానం
సాహిత్యంలో జీవన సాఫల్యం కృషికి ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారాన్ని కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు, అలాగే కవిత్వంలో యువ కవులకు ఇచ్చే శిఖామణి యువ పురస్కారాన్ని అవధానుల మణిబాబుకు మల్లాడి అందజేశారు. పూలమాలలు, శాలువా, మెమోంటో, సన్మానపత్రంలో సత్కరించి నగదు బహుమతి అందజేశారు. సన్మాన గ్రహీతలు తమ స్పందన తెలిపారు.
పదిమందికి కవిసంధ్య ప్రతిభా పురస్కారాల ప్రదానం
వచన, అభ్యుదయ, పత్రికా, లఘుకవిత, దళితసాహిత్యం తదితర అంశాల్లో పది మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఎస్.ఆర్.పృధ్వీ (దీర్ఘకవితలు), పీఆర్‌ఎల్‌స్వామి (కవిత్వధార ణ), బీహెచ్‌వీ.మంగేష్ (పత్రికారంగం), పచ్చిమాల శివనాగరాజు (పద్య కవిత్వం), డాక్టర్ వర గు భాస్కరరెడ్డి (పరిశోధన), కోయి కోటేశ్వరరావు (దళిత సాహిత్య విమర్శ), పుప్పాల సూర్య కుమారి (నవల సాహిత్యం), పొనుగుమట్ల అశోక్‌కుమార్ (వచన కవిత్వం), పెనుమాక రత్నాకర్ (కథా సాహిత్యం), మిరప మహేష్ (వచనకవిత్వం)లకు కవిసంధ్య ప్రతిభా పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు. ఇనాక్ సాహిత్యంపై డాక్టర్ కోయి కోటేశ్వరరావు, అవధానుల మణిబాబు కవిత్వంపై డాక్టర్ కాళ్లకూరి శైలజ మాట్లాడారు. ఈ సందర్భంగా శిఖామణి మాట్లాడుతూ ప్రతీ ఏటా అందించే పురస్కారాలకు కమిటీ ద్వారా కవులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మల్లాడి కృష్ణారావు సౌజన్యంతో పురస్కారాలను ప్రదానం చేసినట్టు తెలిపారు. పదేళ్లుగా కవిసంధ్య పత్రికను ఎన్నో కష్ట నష్టాలకోర్చి వెలువరిస్తున్నట్టు తెలిపారు. కవిసంధ్యకు అండగా నిలుస్తున్న మల్లాడికి కృతజ్ఞతలు తెలిపారు. కవులు మదునాపంతుల సత్యనారాయణమూర్తి, రచయితలు పాల్గొన్నారు.
సమాజం చైతన్యవంతానికి సాహిత్యం బాసట : ఇనాక్
సమాజం చైతన్యవంతంగా పురోగమించడానికి సాహిత్యం బాసటగా నిలుస్తుందని పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శిఖామణి పదేళ్లుగా కవిసంధ్య పత్రికను ఒంటిచేత్తో విజ యవంతంగా వెలువరించడం అభినందనీయమన్నారు. యానాంలో సాహిత్య, కళారంగాలకు మ ల్లాడి కృష్ణారావు సహకారం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. సాహితీపరంగా యా నాం మరింత పురోగతి సాధించగలదని ఆకాంక్షించారు. శిఖామణి తన మనమడు కోసం రాసిన కవితలు చదివానని, చిన్న పిల్లవాడిని అయ్యానని, శిఖామణి కవిత్వం అంతగా కదిలిస్తుందని తెలిపారు. ఈ సభ మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు.