Share News

నేడు ‘కవిసంధ్య’ దశాబ్ది ఉత్సవం

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:17 AM

యానాం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వార్తలు, విశేషాలు, విశ్లేషణలకు పత్రికా మాధ్యమమే ప్రధాన స్రవంతి. సామాజిక చైతన్యానికి కరదీపికలుగా ఈనాటికీ పత్రికలే వెలుగొందుతున్నాయి. సాహిత్య సంపదకూ పత్రికలే పట్టుగొమ్మలయ్యాయి. ఇక కేవలం సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రికలు తెలుగునాట అనేకం ఉన్నాయి. కొత్త కవులకు, రచయితలకు ఇవే తొలి పరిచయ వేదికలు.. పదేళ్ల కిందట ఈ సాహిత్య ప్రక్రియ

నేడు ‘కవిసంధ్య’ దశాబ్ది ఉత్సవం

యానాంలో సాహితీ పురస్కారాల ప్రదానం

హాజరుకానున్న మల్లాడి,

మండలి బుద్ధప్రసాద్‌

పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు

శిఖామణి జీవన సాఫల్య పురస్కారం

యువ పురస్కారం, పది మందికి ప్రతిభా పురస్కారాలు

యానాం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వార్తలు, విశేషాలు, విశ్లేషణలకు పత్రికా మాధ్యమమే ప్రధాన స్రవంతి. సామాజిక చైతన్యానికి కరదీపికలుగా ఈనాటికీ పత్రికలే వెలుగొందుతున్నాయి. సాహిత్య సంపదకూ పత్రికలే పట్టుగొమ్మలయ్యాయి. ఇక కేవలం సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రికలు తెలుగునాట అనేకం ఉన్నాయి. కొత్త కవులకు, రచయితలకు ఇవే తొలి పరిచయ వేదికలు.. పదేళ్ల కిందట ఈ సాహిత్య ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ‘కవి సంధ్య’ కూడా సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ కవి శిఖామణి ఈ కవిసంధ్యకు సంపాదకుడు. కవిత్వం, దానికి అనుబంధంగా కవిత్వపు ధోరణులు, చర్చ, విమర్శలకు మాత్రమే ఇది వేదిక. సాహిత్యంలోనే అనేక ప్రక్రియలను మిళితంగా చేసుకుని పత్రిక నిర్వహించడం వేరు. ఇలా నిర్దేశిత పరిమితులతో ఒకే అంశానికి పరిమితమై ముందుకుసాగడమంటే కత్తిమీద సామే. అయినా సరే, అన్ని సవాళ్లను దాటుకుని పది వసంతాలను కవిసంధ్య పూర్తిచేసుకుని కేంద్ర స్థానం యానాంలో వేడుకను జరుపుకుంటోంది. కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శిఖామణి సాహితీ పురస్కారాల ప్రధాన సభతోపాటు ఈసారి కవిసంధ్య దశాబ్ది ఉత్సవం ఆదివారం జరగనుంది. యానాం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కల్యాణమండపంలో ఈ సభ ఏర్పాటు చేశారు. కవిసంధ్య రథసారథి, కళారత్న డాక్టర్‌ శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో ముఖ్యఅతిఽథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరవుతారు. శిఖామణి జీవన సాఫల్య పురస్కారం-2025ను ప్రముఖ కవి, రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌, యువ పురస్కారం ప్రముఖ కవి, విమర్శకుడు అవధానుల మణిబాబు స్వీకరించనున్నారు. వివిధ సాహిత్య ప్రక్రియలతోపాటు పత్రికా రంగానికి సంబంధించి మొత్తం పది మందికి కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎమ్మెల్యే, తెలుగుభాషా సంస్కృతుల ప్రేమికుడు మండలి బుద్ధప్రసాద్‌, ప్రముఖ పద్యకవి ఆజోవిభో కంధాళం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ప్రముఖకవి రచయిత దాట్ల దేవదానంరాజు, ప్రముఖ సాహితీవేత్తలు మధునాపంతుల సత్యనారాయణమూర్తి, డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు, డాక్టర్‌ కాళ్లకూరి శైలజ, బొల్లోజుబాబా, కుంచే నాగసత్యనారాయణ, సీహెచ్‌ రాం, డాక్టర్‌ గూటం స్వామి తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కవిసంఽధ్య- ఆరుద్ర, బైరాగి శత జయంతి సంచిక ఆవిష్కరణ జరగనుంది.

Updated Date - Oct 26 , 2025 | 01:17 AM