Share News

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో...

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:42 AM

అమలాపురం రూరల్‌ నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, వాటి రాజధానుల వివరాలను కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లీ సెకన్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో విత్తనాల కుషాల్‌నాగవెంకట్‌ చోటు దక్కించుకున్నట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కో

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో...
కుషాల్‌కు సర్టిఫికెట్‌ అందజేస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

చోటు దక్కించుకున్న కాట్రేనికోన విద్యార్థి

అమలాపురం రూరల్‌ నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, వాటి రాజధానుల వివరాలను కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లీ సెకన్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో విత్తనాల కుషాల్‌నాగవెంకట్‌ చోటు దక్కించుకున్నట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. కాట్రేనికోన గ్రామానికి చెందిన కుషాల్‌ కామనగరువు ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ కుశాల్‌కు అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా, జిల్లా సైన్స్‌ అధికారి జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం, ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు డైరెక్టర్‌ నంధ్యాల మనువిహార్‌, కోఆర్డినేటర్‌ వర్థిని పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:42 AM