Share News

భక్తులకు ఇబ్బందులు రాకూడదు

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:59 AM

అన్నవరం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమా సం సందర్భంగా అసంఖ్యాకంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచించారు. బుధవారం అన్నవ

భక్తులకు ఇబ్బందులు రాకూడదు
కార్తీక మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సతప్రభ, ఈవో, చైర్మన్‌

అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి : ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ

అన్నవరం దేవస్థానంలో కార్తీక మాస ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

గతేడాది మాదిరిగా గిరి ప్రదక్షిణలో ఉదయం పల్లకీసేవ, మధ్యాహ్నం సత్యరథసేవ

అన్నవరం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమా సం సందర్భంగా అసంఖ్యాకంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచించారు. బుధవారం అన్నవరం దేవస్థానం లో రెవెన్యూ, పోలీస్‌, ఇతరశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఈవో సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌ అజెండాలను చదివి వినిపించగా దానికి సంబంధించి తీసుకో వాల్సిన చర్యలపై శాఖల అధికారులు లక్ష్యాలు నిర్దేశించారు. ఈనెల 22 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుండగా నవంబరు 2న స్వామివారి తెప్పోత్సవం, నవంబరు 5న గిరి ప్రదక్షిణ జరుగుతందని వీటితోపాటుగా ముఖ్యమైన పర్వదినాలు 15రోజులుగా నిర్ధారించి ఆ రోజుల్లో 50 వేల నుంచి లక్షమంది భక్తులు విచ్చేస్తారని అం చనావేస్తూ దానికణంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. భక్తులు ఎక్కడా తోపులాటలు లేకు ండా పశ్చిమరాజగోపురం వద్ద హోల్డింగ్‌ పాయంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ప్రధానంగా రూ. 300, 1000, 1500, 2000 వ్రతాల కోసం నిరీక్షించే భక్తులను ప్రత్యేక క్యూల ద్వారా ఆయా వ్రతమండపాలకు చేరుకుంటారని తెలిపారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా టూవీలర్లు, నాలుగుచక్రాల వాహనాలకు విడివిడిగా పార్కింగ్‌కు నిర్దేశించామన్నారు. టూవీలర్స్‌ పాత, కొత్త సెంటినరీ కాటేజీల వద్ద, 4చక్రాల వాహనాలు స త్యగిరి జంక్షన్‌ హరిహరమార్గ్‌, సీఆర్వో కార్యాలయం ఎదురుగా, ప్రకాష్‌సదన్‌ ఎదురుగా, ఈ వో కార్యాలయ సమీపంలో స్థలం కేటాయించామ ని, సుమారు వెయ్యి నాలుగుచక్రాల వాహనాల కు పార్కింగ్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అదనంగా 35 మంది హోంగార్డులు..

ప్రత్తిపాడు సీఐ సూరి అప్పారావు మాట్లాడు తూ గతేడాది మాదిరిగా గిరిప్రదక్షిణలో ఉద యం స్వామివారి పల్లకీలో తిరిగేవిధంగా మధ్యా హ్నం భక్తులు సత్యరథం కూడా గిరియాత్ర చేపట్టాలని నిర్ణయించడంతో ప్రస్తు తం ఉన్న భద్రతాసిబ్బందికి అదనంగా 35మంది హోంగార్డులను నియమిస్తామన్నారు. ప్రస్తుతం 20 వాకీటాకీలుండగా మరో 40 వాకీటాకీలు తీసుకుని ఎక్కడా అవాంతరం లేకుండా చూస్తామన్నారు. స్రీశక్తి పథకం అమలులో ఉన్నందున మహిళాభక్తులు అధి కంగా వస్తారని అందుకోసం మహిళా హోంగార్డులను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే సీఐ కు సూచించారు. పర్వదినాల్లో ఒంటిగంట నుంచి వ్రతాలు, రెండుగంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించేలా చర్యలు తీసుకునే బాధ్యత ఆలయ, సన్నిధి విభాగ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 480 మరుగుదొడ్లు ఉండగా అదన ంగా మరో 22 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4730 మంది వేచిఉండేలా హోల్డింగ్‌ పాయింట్లను, 925మందికి ఉచిత డార్మెటరీలలో లాకర్లు, స్నానపుగదులు అందుబాటులో ఉంచామన్నారు.

నెలరోజులు ఇద్దరు గజ ఈతగాళ్లు..

స్వామివారి తెప్పోత్సవానికి సంబంధించి పంపా రిజర్వాయర్‌లో 94 అడుగుల నీటిమట్టం ఉండేలా చూస్తామని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. గతంలో తెప్పోత్సవం రోజున మాత్రమే గజఈతగాళ్లను అందుబాటులో ఉంచగా నెలరోజులు కార్తీకమాసం పుణ్యస్నానాలు పంపాలో చేస్తారనే ఉద్దేశ్యంతో నెలరోజులు ఇద్దరు గజ ఈ తగాళ్లను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యుత్‌సరఫరా నిరంతరాయంగా ఉండాలని, లూజు కలెక్షన్‌లు సరిచేయాలని వి ద్యుత్‌శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొండపైన రెండుచోట్ల, కొండదిగువున ఒకచోట 24 గంటలు అందుబాటులో మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తామని వైద్యశాఖాధికారి రవికుమార్‌ తెలిపారు. 108 వాహనం అందుబాటులో ఉంచు తామన్నారు. ఆర్టీసీ ద్వారా అదనపు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రామంలో శానిటేషన్‌ నిర్వహణపై తమకు గతేడాది మాదిరిగా అదనపు పారిశుధ్య సిబ్బందిని కేటాయిస్తే కొండదిగువ పారిశుధ్య బాధ్యతలు తీసుకుని ఎక్కడా ఇబ్బందిలేకుండా చూస్తామని సర్పంచ్‌ కుమార్‌రాజా ఎమ్మెల్యేకు వివరించారు. సమావేశంలో తహశీల్దార్‌ తాతారావు, దేవస్థానం ఏఈవోలు, సూపరెంటెండ్‌లు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. అంతకముందు ఎమ్మెల్యే సత్యప్రభ స్వామిని దర్శించుకున్నారు.

అగ్నిప్రమాదాల నివారణకు ప్రణాళిక

ఫైర్‌శాఖ అధికారులు కార్తీకం ప్రారంబానికి ముందే అగ్నిప్రమాద నివారణ నష్టం లేకుండా ముందుగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఫైరింజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని దానికి పక్కా ప్రణాళికతో ముందుకెళతామని ఫైర్‌ ఆడిట్‌ జరుగుతందని తుని ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు.

Updated Date - Oct 09 , 2025 | 12:59 AM