కార్తీకం.. సత్యదేవుడి సన్నిధి సిద్ధం!
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:43 AM
అన్నవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది కార్తీకమాసం. ఈ కార్తీకంలో హరిహరక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధికి ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షలమంది తరలి
భక్తులకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెలలో సుమారు 20 లక్షలమంది విచ్చేస్తారని అంచనా
1.50 లక్షల వ్రతాలు జరిగే అవకాశం
అన్నవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది కార్తీకమాసం. ఈ కార్తీకంలో హరిహరక్షేత్రంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధికి ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షలమంది తరలివస్తారని అంచనాతో దానికణుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భ క్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ముం దుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వివి ధ శాఖలు సమన్వయంతో పలు లక్ష్యాలను నిర్దేశించుకోగా వాటిని ఆచరణలోకి తీసుకొచ్చారు. పర్వదినాల్లో ఒంటిగంట నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించారు. పశ్చిమ రాజగోపురం వద్ద ఎటువంటి తోపులాటలకు ఆ స్కారం లేకుండా వాటర్‌ప్రూఫ్ షెడ్డు వేసి హో ల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. లోపల వ్రతమండపాలు ఖాళీ అయితేనే హోల్డింగ్ పాయింట్ నుంచి భక్తులు లోపలకి చేరతారు. వాహనాలు అన్నింటికీ వన్‌వే మార్గం ఏర్పాటుచేశారు. పశ్చి మ రాజగోపురం ఎదురుగా సుమారు రూ.2.50 కోట్లతో ఫార్మాషూటికల్ సంస్థ సహకారంతో భారీ షెడ్డును వినియోగంలోకి తీసుకొచ్చారు. దీనిలో వ్రతం, దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయాలు జరుపుతారు. అదేవిధంగా భక్తులు వేచిఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు, వాకీటాకీల ద్వారా పర్యవేక్షణ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్‌రూం ద్వారా అధికారులు, సిబ్బందికి సూచనలు చేసేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. వివిధ వాహనాల్లో విచ్చేసే భక్తులకు పార్కింగ్ సత్యగిరికి తరలించి అక్కడినుంచి దేవస్థానం ఉచిత వాహనాల్లో స్వామి సన్నిధికి చేర్చుతారు. నవంబరు 2న స్వామివారి తెప్పోత్స వం సాయంత్రం 5.30కి ప్రత్యేకపూజలతో ప్రారంభమై రాత్రి 7.30కి పంపా సరోవరంలో నౌకావిహారం జరుపుతారు. ప్రధానంగా కార్తీకపౌర్ణమి రోజు న జరిగే గిరిప్రదక్షిణకు సుమారు 2 లక్షల మంది విచ్చేయనుండగా.. ఉదయం 8 గంటలకు తొలిపావంచా వద్ద నుంచి స్వామి,అమ్మవార్లను పల్లకీలో మధ్యాహ్నం 2గంటల నుంచి సత్యరథంపై గిరియాత్ర నిర్వహిస్తారు. భక్తులు సత్యరథం ద్వా రా గిరియాత్ర చేపట్టాలని అధికారులు కోరారు.
వాహనదారులు నిబంధనలు పాటించడం తప్పనిసరి
అన్నవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం పురస్కరించుకుని వేలాదిగా రోడ్డు, రైలు మార్గాల్లో అన్నవరం విచ్చేసిన భక్తులను కొండపైకి తీసుకెళ్లే ఆటో, బస్సు, ఇతర ప్రయివేట్ వాహనదారులతో సోమవారం అన్నవరం ఎస్‌ఐ హరిబాబు, దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. ప్రధానంగా లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లను కలిగి ఉండాలని, యూనిఫాం ధరించి, అతివేగంగా వాహనాలు నడపకుండా ఉండాలన్నారు. నిర్ణయించిన పాసి ంజర్ల కంటే ఎక్కువమందిని ఆటోలో ఎక్కించకుండా వారిపై గౌరవంగా మాట్లాడడం, ఎవరైనా తమ లగేజీని ఆటోలో మరిచిపోయిన ఎడల వారికి బాధ్యతగా అప్పగించడం, సంబంధిత విషయాన్ని పోలీసులకు తెలియపరచడం చేయాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా, నిర్దేశిత ప్రదేశాల్లో పార్కింగ్ చేయాల న్నారు. రాంగ్‌రూట్‌లో ప్రయాణాలు నిషిద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో దేవస్థానం ట్రాన్స్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు.
ముగ్గురు ప్రత్యేకాధికారుల నియామకం
అన్నవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం సందర్భంగా సత్యదేవుడి సన్నిధికి లక్షలాదిగా విచ్చేసే భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుం డా ఉండేందుకు ముందస్తు జాగ్రత్య చర్యల్లో భాగంగా దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ముగ్గురు దేవదాయశాఖ అధికారులను డిప్యూటేషన్‌లో ప్రత్యేకంగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, వాడపల్లి దేవస్థానం ఈవో ఎన్.చక్రధరరావు, లోవ దేవస్థానం ఈవో విశ్వనాధరాజును నియమించారు. కార్తీకమాసంలో 4 శని,ఆది,సోమవారాలు... 2 దశమి, ఏకాదశిలు, కార్తీకపౌర్ణమి గిరిప్రదక్షిణ, తెప్పోత్సవం వంటి ముఖ్యమైన రోజు ల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. నిర్దేశించిన రోజుల్లో వీరంతా అన్నవరంలో ఉండి భక్తుల కోసం క్యూలైన్లు, వ్రతాల నిర్వహణ, మౌలిక వసతులు పర్యవేక్షణ చేయనున్నారు.