Share News

కరాటే పోటీల విజేత ఉమ్మడి జిల్లా

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:07 AM

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు పీఆర్కే ఫంక్షన్‌ హాలులో ఆదివారం పవర్‌

కరాటే పోటీల విజేత ఉమ్మడి జిల్లా
పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీ హరీష్‌మాధుర్‌

పేరూరులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కరాటే పోటీలు

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు పీఆర్కే ఫంక్షన్‌ హాలులో ఆదివారం పవర్‌కిక్‌ షోటోకాన్‌ కరాటే డూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కరాటే పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. పోటీలను ఆదివారం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ ప్రారంభించారు. 6 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు గల సుమారు 952 మంది క్రీడాకారులు పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచినట్టు చీఫ్‌ఆర్గనైజర్‌ పడాల అంజి తెలిపారు. కటాస్‌, కుమిటీ విభాగాల్లో ఈ పోటీలను ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చిక్కం సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమస్థానం, తెలంగాణకు ద్వితీయ స్థానం దక్కింది. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. గంటి హరీష్‌బాలయోగితో పాటు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబు పతకాలు, ప్రశంసాపత్రాలను అందించారు. పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:07 AM