‘కంద’ని ధర!
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:38 AM
కంద ధర చూసి రైతు ముఖం కందబారి పోతోంది. ఏం చేయాలో తోచక తెల్లముఖం వేసుకుని చూస్తున్నాడు.
సగానికి సగం తగ్గుదల
గతేడాది క్వింటా రూ.12 వేలు
ఈ ఏడాది క్వింటా రూ.6 వేలు
పడిపోయిన ఎగుమతులు
లబోదిబోమంటున్న రైతాంగం
పెట్టుబడులు రావని ఆందోళన
నెమ్మదించిన కంద తవ్వకాలు
పెరవలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కంద ధర చూసి రైతు ముఖం కందబారి పోతోంది. ఏం చేయాలో తోచక తెల్లముఖం వేసుకుని చూస్తున్నాడు. ధర బాగుంటుందని సాగు చేస్తే సగానికి సగం ధర తగ్గడంతో దిగాలుగా ఉండిపోతున్నారు. పంటను అమ్మ లేక.. దాయలేక సతమతమవుతున్నాడు. రేటు దిగజారిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది క్వింటా రూ.12 వేల పలికిన కంద ప్రస్తుతం రూ.6 వేలకు దిగజారిపోవడంతో పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు.
విరివిగా కంద సాగు..
గత డిసెంబరు, జనవరి నెలలో కంద సాగు ఆరంభిస్తారు. పెరవలి మండలంతో పాటు ఉండ్రాజవరం, కొవ్వూరు, నిడదవోలు తదితర మండలాల్లో కందను విరివిగా సాగు చేస్తా రు. ఎకరానికి సుమారు 25 గుత్తుల వరకు కంద కొనుగోలు చేసి నాటతారు. దీనికి ఎరు వులు, ఇతర ఖర్చుల కింద వేలాది రూపాయ లు పెట్టుబడులు పెడతారు. ఆగస్టు నెల నుంచి కంద పక్వానికి వస్తుంది. సెప్టెంబరు అక్టోబరు నెలల్లో కూడా తవ్వకాలు ఉంటాయి. ఈ ఏడాది ధర లేకపోవడంతో తవ్వకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎకరానికి 50 నుంచి 80 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో చేలు కౌలుకు తీసుకుని కంద సాగు చేసే రైతులు సిస్తులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రేటు సగానికి పడిపోవడంతో ఎటూ పాలుపోని స్థితి లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని..విత్తనం ఖరీదు రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఎకరాకు రూ.లక్ష నష్టం..
ఎకరం కంద సాగుకు పెట్టుబడి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతుందని ప్రస్తు తం దిగుబడిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వస్తుందని దీంతో రూ.లక్ష పైగా నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇక్క డి నుంచి కంద బిహార్, పశ్చిమబెంగాల్,తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగు మతి చేస్తుంటారు. ప్రస్తుతం రేటు బాగోలేకపోవడంతో ఎగుమతులు కూడా మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.