సాదాసీదాగా జడ్పీ స్థాయి సంఘాల సమావేశం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:04 AM
కాకినాడ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం సాదాసీదాగా సాగి ంది. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో శుక్రవారం 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగాయి
కాకినాడ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం సాదాసీదాగా సాగి ంది. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో శుక్రవారం 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగాయి. వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన 3వ స్థాయి సంఘ సమావేశం, వైస్ చైర్‌పర్సన్ మేరుగు పద్మలత అధ్యక్షతన 6వస్థాయి సంఘ సమా వేశం, జడ్పీటీసీ రొంగల ప ద్మావతి అధ్యక్షతన 5వస్థాయి సంఘ సమావేశం జరిగాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూ రల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మందుగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ఉమ్మడి జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. అనపర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ అనపర్తిలో తా గునీటి సౌకర్యం కల్పించేందుకు జిల్లా పరిషత్‌కు చెందిన కొంతస్థలం కేటాయిస్తే తాగునీటి ప్రొజెక్టు కల్పించగమని, అందువల్ల వాటర్ గ్రిడ్‌లకు ఎకరం స్థలం కేటాయించాలని కోరారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట సెంటర్ నుంచి సర్పవరం మీదుగా ఉప్పుటేరు వరకు ఆక్రమణలకు గురైన పంట కాలువను పునరుద్ధరిస్తే కాకినాడను ముంపు బారి నుంచి కాపాడవచ్చన్నారు. రాజానగరం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తా వించారు. ఆయాస్థాయి సంఘాల సమావేశాల్లో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశు ధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఇప్పటి వరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై సభ్యులు చర్చించారు. సమా వేశంలో జడ్పీ సీఈవో వీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో జీఎస్ రాంగోపాల్, ఆయా జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.