ప్రజా సమస్యలపై గళం
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:23 AM
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా అవసరాలు, సమస్యలపై జడ్పీటీసీలు గళ మెత్తారు. అధికారుల పొంతనలేని వివరణలపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సం ఘాల సమావేశం జడ్పీ చైర్మన్ విప్పర్తి
అధికారుల పొంతన లేని
వివరణలపై జడ్పీటీసీల అసహనం
కాకినాడలో ఉమ్మడి జిల్లా
జడ్పీ స్థాయి సంఘాల సమావేశం
హాజరైన ఎమ్మెల్సీలు, అధికారులు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా అవసరాలు, సమస్యలపై జడ్పీటీసీలు గళ మెత్తారు. అధికారుల పొంతనలేని వివరణలపై అసహనం వ్యక్తం చేశారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సం ఘాల సమావేశం జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగో పాలరావు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్య క్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధి కారు లకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి చొరవ చూపాలని జడ్పీచైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులను కోరారు.
పూడికతీత పనులు చేపట్టాలి : జడ్పీటీసీలు
ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్‌లకు కాలు వల ద్వారా నీరు సక్రమంగా పంట పొలాలకు అందేలా చూడాలని, అకాల వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురికాకుండా ఇరిగే షన్ కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలని సభ్యులు అధికారులను కోరారు. ఏడోస్థాయి సంఘం చర్చలో భాగంగా ఇరిగేషన్ కాలువల్లో చేపట్టిన పూడికతీత పనులు, కొత్తగా ప్రతిపాదిం చిన అంశాలు, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇరి గేషన్ పనుల పురోగతిపై అధికారులు సంబంధిత వివరించారు. నాల్గోస్థాయి సంఘం చర్చలో విద్య వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యా ధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని సభ్యులు తెలిపారు. అర్బన్ రూరల్ హె ల్త్ మిషన్ కింద అవసరమైన చోట పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకురా వాలని, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవస రమైన అధికారులు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని విఽవిధ మండలాల సభ్యులు అధికారులను కోరారు. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి శుక్ర వారం డ్రైడే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నా మని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెండో స్థాయి సంఘం చర్యలో గ్రామీణ అభివృద్ధికి సం బంధించి జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించా రు. సీసీ రోడ్డు, డ్రైన్లు, ఉపాధి పనిదినాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు ఇరుపక్కల తుప్పలు తొలగిం చడం, పశువుల షెడ్ల నిర్మాణంపై సభ్యులు అధి కారులను వివరాలు కోరారు. ఐదో స్థాయి సం ఘం చర్యలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్య మైన పౌష్టికాహారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంది ంచాలని సభ్యులు సూచించారు. పౌష్టికాహారం సక్ర మంగా అందించడం ద్వారా రక్తహీనత సమస్యకు గురికాకుండా చూడాల న్నారు. ఆర్థిక, ప్రణాళిక అంశంపై చర్చలో గ్రా మాల్లో సక్రమంగా తా గునీరు, పారి శుధ్య ంపై సూచనలు చేశారు. సంక్షే మ శాఖల చర్చలో వివి ధ సంక్షేమ వసతి గృహా ల పనితీరున సమీ క్షించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు సమకూర్చాలని సూచించారు. స్థాయి సంఘాలు చర్చించి సూచించిన అంశాలన్నింటిపై ఉమ్మడి జిల్లాలోని అధికారులు సత్వర చర్యలు చేపట్టి రానున్న సర్వ సభ్య సమావేశంలో పూర్తిస్థాయి సన్నద్ధతతో వివరించాలని జడ్పీ చైర్మన్ కోరారు.
అక్షరాంధ్ర ప్రతిజ్ఞ
అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జడ్పీ సీఈవో లక్ష్మణ రావు, జిల్లా వయోజన విద్యశాఖ డీఈ పోశయ్య తో కలిసి ఎమ్మెల్సీలు, సభ్యులతో ప్రతిజ్ఞ చేయిం చారు. అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. తొలుత రామచంద్రపురం జడ్పీటీసీ ఎం.వెంకటేశ్వరరావు అకాల మృతికి చిం తిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఐదో స్థాయి సంఘ చైర్‌పర్సన్ రొంగల పద్మావతి, జడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణమూర్తి, డిప్యూటీ సీఈవో రామ్‌గోపాల్, జడ్సీటీసీలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
యూరియా కొరత లేకుండా చూడాలి
మూడో స్థాయి సంఘం వ్యసాయ శాఖ చర్య లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ యూ రియా కొరత లేకుండా అధికారులకు సూచిం చారు. మోతాదుకు మించి యూరియా ఉపయో గించడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడు తున్నారని, ఈ విషయమై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. మరో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ అధి కారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచేలా చూడాలని కోరారు.