రంగులే.. తీరం కొత్త రూపులే..
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:22 AM
కొత్తపల్లి, జూలై 9 (ఆంరఽధజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం బుధవారం రంగురంగులుగా దర్శనమిచ్చింది. ఇటీవ
కొత్తపల్లి, జూలై 9 (ఆంరఽధజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం బుధవారం రంగురంగులుగా దర్శనమిచ్చింది. ఇటీవల వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు వివిధ పాయల ద్వారా సముద్రంలోకి చేరుతోంది. అక్కడి నుంచి నుంచి బురద నీరు నేరుగా సముద్రంలోకి ప్రవేశించడంతో నీలి రంగులో ఉండే సముద్రం సగభాగం బురద, కొంచెం మేర నీలి రంగు, మరి కొంత భాగం తెలుపురంగులో దర్శనమిస్తోంది. రంగులుగా దర్శనమిస్తున్న సముద్రాన్ని పర్యాటకులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.