తీరం కల్లోలం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:33 AM
కొత్తపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. ఉప్పా డ, అమీనబాద్, మాయాపట్నం, సూరాడ పేట, కొత్తపట్నం తదితర తీరప్రాంత గ్రామాల నుంచి వేటకు వెళ్లిన మత్స్య కారులు బోట్లకు సముద్రంలో లంగ
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో లంగర్‌పై బోట్లు
కొత్తపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. ఉప్పా డ, అమీనబాద్, మాయాపట్నం, సూరాడ పేట, కొత్తపట్నం తదితర తీరప్రాంత గ్రామాల నుంచి వేటకు వెళ్లిన మత్స్య కారులు బోట్లకు సముద్రంలో లంగర్లు వేసి ఒడ్డుకు చేరుకున్నారు. రాత్రికి లేదా సోమ వారం ఉదయానికి తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని మత్స్యకారులు చెప్తున్నారు. ఈసారి సముద్రం ఉగ్ర రూపం దాలిస్తే మాయాపట్నం నుంచి కొత్తపట్నం తీరం వరకు కెరటాలు రోడ్డుపైకి దూసుకొచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.