ఏం సమాచారమొచ్చిందో..!
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:24 AM
కాకినాడ, అక్టోబరు 14 (ఆం ధ్రజ్యోతి): కాకినాడ సీ పోర్టు, యాంకరేజ్ పోర్టులను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా వ్యవస్థలను పరిశీలించారు. పోర్టు నిర్వహణలో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులలో పొందుపరిచిన విషయాలను క్షుణ్ణంగా గమనించారు. పీఆర్‌వో సబ్ ఇన్‌స్పెక్టర్ పి.పవన్‌కుమార్, ఏపీ ఆర్వో సిబ్బందికి తగు మార్గదర్శకాలు ఇచ్చారు. అలాగే పోర్టు పరిధిలోని చెక్‌పోస్టుల పని
కాకినాడ సీ, యాంకరేజ్ పోర్టులను ఆకస్మికంగా పరిశీలించిన ఎస్పీ
కాకినాడ, అక్టోబరు 14 (ఆం ధ్రజ్యోతి): కాకినాడ సీ పోర్టు, యాంకరేజ్ పోర్టులను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా వ్యవస్థలను పరిశీలించారు. పోర్టు నిర్వహణలో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులలో పొందుపరిచిన విషయాలను క్షుణ్ణంగా గమనించారు. పీఆర్‌వో సబ్ ఇన్‌స్పెక్టర్ పి.పవన్‌కుమార్, ఏపీ ఆర్వో సిబ్బందికి తగు మార్గదర్శకాలు ఇచ్చారు. అలాగే పోర్టు పరిధిలోని చెక్‌పోస్టుల పనితీరుపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని కలిసి భద్రతా అంశాలపై దృష్టిసారించారు. చెక్‌పోస్టు సిబ్బందికి భద్రత, విజిలెన్స్, రికార్డ్ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశా లపై స్పష్టమైన సూచనలు అందించారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ జాకబ్ సత్యరాజు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్యూరిటీ ఆఫీసర్ సూర్యనారాయణ తదితరులు పోర్టులో భద్రతా చర్యలపై వివరాలు సమర్పించారు. పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక పరికరాలు సీసీ టీవీ పర్యవేక్షణ, అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్‌ను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. భద్రతా చర్యల్లో ఎటువంటి అల సత్వం ఉండకూడదని, అన్ని విభాగా లు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశా రు. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆకస్మిక పర్యటనతో అక్కడ పోర్టు అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రతను ముమ్మరం చేశారు. ఏదైనా ఉపద్రవం ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అన్నట్టుగా కంగారు పడ్డారు. ఇది సాధారణ తనిఖీనా లేక ఏమైనా సమాచారం వచ్చిందా? అని ఆశ్చర్యపోయారు. మరోవైపు బిందుమాధవ్ కూడా ఈ మధ్య కాలంలో ఇలా పోర్టులో ఆకస్మిక పర్యటనలు చేసిన దాఖలాలు లేవు. మొత్తానికి ఆయ న పర్యటన వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తీర ప్రాంతంలో భద్రతను కట్టుది ట్టం చేసేందుకే ఆయన పర్యటన చేశారా? మరే ఇతర కారణమేదైనా ఉందా? అనేది అంతుచిక్కడం లేదు.