Share News

ఐదేళ్లు పూర్తయిన 85 సిబ్బందికి బదిలీలు

ABN , Publish Date - May 17 , 2025 | 01:33 AM

కాకినాడక్రైం, మే16 (ఆంధ్ర జ్యోతి): ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకు న్న సిబ్బందికి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్టు ఎస్పీ బిందుమాధవ్‌ తె

ఐదేళ్లు పూర్తయిన 85 సిబ్బందికి బదిలీలు
పోలీసు సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్పీ

కాకినాడక్రైం, మే16 (ఆంధ్ర జ్యోతి): ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకు న్న సిబ్బందికి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్టు ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపా రు. ఐదేళ్లు పూర్తయిన 19 మంది ఏఎస్‌ఐలు, 43 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 23 మంది కానిస్టేబుళ్లకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఖాళీగా ఉన్న పోలీస్‌స్టేషన్ల వివరాలను ప వర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించారు. సిటీ పరిధిలో పనిచేసిన వారిని గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ స్టేషన్లలో పని చేసిన సిబ్బందిని సిటీకి బదిలీ చేసి సమతుల్యతకు పెద్దపీట వే శారు. ఏఎస్పీ (అడ్మిన్‌) ఎంజేవీ భాస్కరరావు, పరిపాలనాధికారి ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 01:33 AM