మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల గ్యాంగ్ సంచారం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:12 AM
కాకినాడ క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల బ్యాచ్ దువ్వాడ-స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉంద ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కాకినాడ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తక్షణం డయల్ 100, 111 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసుల
అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తక్షణం పోలీసులకు సమాచారమివ్వాలి
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల బ్యాచ్ దువ్వాడ-స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉంద ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కాకినాడ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తక్షణం డయల్ 100, 111 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఓ ప్రకటనలో కోరారు. బుధవారం రాత్రి ఈ దొంగల బ్యాచ్ స్టీల్‌ప్లాంట్ ప్రాంతాల్లో తిరిగారని అనకాపల్లి మీదుగా కాకినాడ జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసు కునే అవకాశం ఉందన్నారు. అనుమానాస్పదంగా వాహ నాలు తిరిగినా, వ్యక్తులు సంచరిస్తున్నా తక్షణం సెక్యూరి టీ, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయాలన్నారు. ఇళ్లను లాక్ చేసి బయటకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎం ఎస్‌ని వినియోగించుకోవాలని కోరారు. రాత్రి పూట ఇం టి భద్రతా చర్యల్లో భాగంగా ప్రధాన తాళాలు, గేట్లు, గ్రిల్స్ బిగించి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించుకోవాలన్నారు. ముందస్తు భద్రత చర్యలు తీసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.