చిట్టిబుర్రలు.. భలే ఆవిష్కరణలు!
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:24 AM
కాకినాడ రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడలోని సాలిపేట పైండా సత్తిరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల్లో శనివారం పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన- 2025ను జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులతో తమ ప్రదర్శనలతో ఆకట్టు
కాకినాడలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
ఆకట్టుకున్న విద్యార్థులు
172 ప్రాజెక్టుల ప్రదర్శన
ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి
కాకినాడ రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడలోని సాలిపేట పైండా సత్తిరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల్లో శనివారం పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన- 2025ను జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులతో తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీఈవో పిల్లి రమేష్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ సైన్స్ లోగోను ఆవిష్కరించగా సైన్స్‌అధికారి జిల్లా సైన్స్ రిపోర్టును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు బా గా రాణించి రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని దానికోసం అవసరమైన సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. డీఈవో మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులను సైన్స్ పట్ల ఆకర్షితులయ్యేలా బోధిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. మం డలస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు 172 ప్రాజెక్టులతో ఈ ప్రదర్శనకు హాజరయ్యారన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఈనెల 23,24 తేదీల్లో విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఈవో తెలిపారు. జిల్లాలోని 21 మండలాల నుంచి హాజరైన విద్యార్థులు, గైడ్‌ల సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మ శ్రీ హాజరై ప్రథమ, ద్వితీయ విజేతల కు మెమొంటోలు, ప్రతిభాపత్రాలను అందజేశారు. ఆమె మా ట్లాడుతూ చిట్టిబుర్రలు భవిష్యత్ ఆవిష్కరణలకు నెలవులు అన్నారు. కార్యక్రమంలో డీవైఈవోలు కేవీవీ సత్యనారాయణ, ఈ.ప్రభాకరశర్మ, ఎంఈవోలు సీహెచ్ రవి, టి.సుబ్బారావు, టీ వీఎస్ రంగారావు, శ్రీనివాసకుమార్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనలు
7 అంశాలు, 9 సబ్జెక్టుల్లో ఈ పోటీలు నిర్వహించగా జి.శివజ్యోతి, జె.నవ్య, డి.రేవతి, కె.పల్ల విలాస్య, టి.గంగా భవానీ, ఆశాజ్యోతి, ప్రకృతి, శివదుర్గ, వినయ్‌తేజ, భారతి, రమణమూర్తి ప్రదర్శనలు ప్రథమస్థానాన్ని సాధించాయి. నాగశ్రీవల్లీ, సాత్విక, డీజీ వీరలక్ష్మీ, యశోద, జెస్సికా, ఎన్‌ఎస్‌దేవి, నాగేశ్వరి ప్రదర్శనలు ద్వితీయ స్థానాన్ని పొందాయి.