సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కాకినాడ ఆర్డీవోకు తీవ్ర అస్వస్థత
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:27 AM
సామర్లకోట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సామర్లకోటలో సీఎం పర్యటన ఏర్పాట్లు పర్య వేక్షిస్తూ కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు శుక్ర వారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ప్రభుత్వా సుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అమల, వరలక్ష్మి, కిరణ్ ప్రాథమిక చికిత్స నిర్వహించి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండ
ఆసుపత్రిలో చేరిక
సామర్లకోట, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సామర్లకోటలో సీఎం పర్యటన ఏర్పాట్లు పర్య వేక్షిస్తూ కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు శుక్ర వారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ప్రభుత్వా సుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అమల, వరలక్ష్మి, కిరణ్ ప్రాథమిక చికిత్స నిర్వహించి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సామర్లకోటలో వివిధ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌తో పర్యవే క్షిస్తుండగా బీపీ లెవెల్స్ పడిపోవడం, షుగ ర్ లెవల్స్ కూడా తగ్గడంతో కళ్లు తిరుగు తున్నట్టు సిబ్బందికి తెలియజేశారు. దీంతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్డీవో కారులో తీసుకువెళ్లగా తీవ్ర అస్వస్థతకు లోనై కుప్పకూలారు. సమాచారం తెలుసు కున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సీఎం సభా ఏర్పాట్ల నుంచి సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వైద్యు లతో ఆర్డీవో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం అంబులెన్స్ వెంట కాకినాడ ఆసు పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని డాక్ట ర్లను ఆదేశించారు. మరో 2 రోజుల వరకూ ఐసీ యూలో ఉంచి చికిత్స నిర్వహించడం ద్వారా అ బ్జర్వేషన్‌లో ఉంచనున్నట్టు వైద్యులు తెలిపారు.