Share News

పెట్రో కెమి‘కిల్‌’ఫ్యాక్టరీ!

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:05 AM

ఒక్క ఛాన్స అంటే.. ఓటరు ఆలోచించాడు.. అవకాశమిచ్చాడు.. ఆ అవకాశాన్ని జగన దుర్వినియోగం చేశారు.. ఎంతలా అంటే అభివృద్ధి చేయాల్సిన రాషా్ట్రన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వదిలేశారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘటనే ఇందుకు నిదర్శనం.. గత వైసీపీ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని నాయకులు అంటూనే ఉంటారు.. ఇది అక్షర సత్యం.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 32 వేల కోట్ల ప్రాజెక్టు ఇస్తామంటే వదులుకుంటారా.. అధికారమిచ్చిన ఐదేళ్లూ పట్టించుకోకుండా జగన వదిలేశారు.. ఆ ప్రాజెక్టును అతీగతీ లేకుండా చేసేశారు...ఆ కథాకమామిషు ఏమిటో తెలుసుకోవాలనుందా..!

పెట్రో కెమి‘కిల్‌’ఫ్యాక్టరీ!

  • గత వైసీపీ నిర్లక్ష్యం..గాల్లో కలిసిన ప్రాజెక్టు

  • విభజన హామీగా పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌

  • రూ.32 వేల కోట్లతో ఏర్పాటుకు గ్రీనసిగ్నల్‌

  • తొమ్మిదేళ్లు పూర్తయినా కదలిక లేదు

  • తాజాగా నెల్లూరులో బీపీసీఎల్‌ ప్రాజెక్టు

  • కాకినాడ పెట్రో కెమికల్‌ ప్రాజెక్టుపై చర్చ

  • ప్రాజెక్టు జాప్యానికి బాధ్యత వైసీపీదేనన్న కేంద్రం

  • నాడు బాబు పట్టుదల.. జగన నిర్లక్ష్యంతో మూలకు

ఒక్క ఛాన్స అంటే.. ఓటరు ఆలోచించాడు.. అవకాశమిచ్చాడు.. ఆ అవకాశాన్ని జగన దుర్వినియోగం చేశారు.. ఎంతలా అంటే అభివృద్ధి చేయాల్సిన రాషా్ట్రన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వదిలేశారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘటనే ఇందుకు నిదర్శనం.. గత వైసీపీ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని నాయకులు అంటూనే ఉంటారు.. ఇది అక్షర సత్యం.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 32 వేల కోట్ల ప్రాజెక్టు ఇస్తామంటే వదులుకుంటారా.. అధికారమిచ్చిన ఐదేళ్లూ పట్టించుకోకుండా జగన వదిలేశారు.. ఆ ప్రాజెక్టును అతీగతీ లేకుండా చేసేశారు...ఆ కథాకమామిషు ఏమిటో తెలుసుకోవాలనుందా..!

- కాకినాడ, ఆంధ్రజ్యోతి

కాకినాడలో రూ.32 వేల కోట్లతో తొమ్మిదేళ్ల కిందట తలపెట్టిన పెట్రో కెమికల్‌ కాంపెక్స్‌ ఏర్పాటు ముగిసిన అధ్యాయంగానే కనిపిస్తోంది. ఇటీవల నెల్లూరులో రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్‌ పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎప్పటికైనా ఇక్కడా ఆ తరహా ప్రాజెక్టు రాకపోతుందా అనే ఆశలు తాజాగా నెల్లూరు ప్రాజెక్టుతో అడియాశలైనట్లయింది. గత వైసీపీ ప్రభు త్వ నిర్వాకంతో పూర్తిగా ఈ ప్రాజెక్టు మూలనపడి పోయింది. పెట్రో కాంప్లెక్స్‌ వీజీ ఎఫ్‌ నిధులు రాష్ట్రం భరించే విషయంలో అప్పటి జగన సర్కారుదే తప్పని కేంద్రం కుండబద్దలు కొట్టింది. ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ గత సర్కారు తీరు వల్ల ప్రాజెక్టు కొడిగట్టిపోయింది.

కొంపముంచిన బాధ్యతా రాహిత్యం..

రాష్ట్ర విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో కొత్త ప్రాజెక్టు కేటాయించింది. అందులో భాగంగా కాకినాడలో రూ.32 వేల కోట్లతో భారీ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. 2017లో కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో రెండు వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి గెయిల్‌- హెచపీసీఎల్‌ సంయుక్తంగా ఒప్పం దం కుదుర్చుకున్నాయి. 1.5 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పా టుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో అంగీకార పత్రాలు మార్చుకున్నాయి. విదేశాల నుంచి ముడిచమురు కాకినాడకు దిగుమతి చేసుకుని ఇక్కడే కర్మాగారం ఏర్పాటుచేసి, దాన్ని శుద్ధి చేసి దేశీ యంగా వినియోగించడం ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

నెల్లూరు ప్రాజెక్టుతో మళ్లీ చర్చ..

రాష్ట్రప్రభుత్వం చొరవతో ఇటీవల నెల్లూరులో రూ.లక్ష కోట్లతో భారత పెట్రోలియం కార్పొరేషన లిమిటెడ్‌ (బీపీ సీఎల్‌) పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏటా తొమ్మిది మిలియన మెట్రిక్‌ టన్నుల సా మర్థ్యం తో దీన్ని స్థాపిస్తోంది. ప్రాజెక్టు ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు రానుండగా.. 42 నెలల్లో పూర్తి చేసేలా ఇటీవల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండు రో జుల కిందట బీపీసీఎల్‌ పెట్రో కాంప్లెక్స్‌కు కేంద్ర అటవీ పర్యావరణశాఖ నుంచి కీలక అనుమతులు జారీ అ య్యాయి. దీంతో ఇప్పుడు కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తొమ్మి దేళ్ల నుంచి అతీగతీ లేని ప్రాజెక్టు నెల్లూరు పెట్రో కాం ప్లెక్స్‌ ఏర్పాటుతో ఇక్కడా ఎంతో కొంత కదలిక రావాలనే ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. పెట్రో ప్రాజెక్టుకు అను వైన వాతావరణం ఉన్నా కేంద్రం పట్టించుకోక కాకినాడ పెట్రోకాంప్లెక్స్‌ అధ్యాయం ముగిసినట్టే కనిపిస్తోంది.

తరువాత జగనేం చేశారు?

2019లో వైసీపీ అధికారంలోకి రావ డంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. నాటి నుంచీ ఈ ప్రాజె క్టు ఊసు పక్కన పడి పోయింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో 2021 జూనలో కేంద్రాన్ని సీఎం హోదాలో జగన కలిసి ప్రాజెక్టు కొనసాగించాలని కోరా రు. కానీ కేంద్రం నుంచి సానుకూల ప్రకటనేదీ రాలేదు. మూడేళ్ల కిందట పెట్రో కాంప్లెక్స్‌ అసలు కాకినాడకు వస్తుందా? రాదా? అనే దానిపై పలువురు ఎంపీలు కేంద్రాన్ని లోక్‌సభలో ప్రశ్నిస్తే ప్రాజెక్టు జాప్యా నికి జగన ప్రభుత్వమే కారణం అని కుండ బద్దలుకొట్టింది. తాము అన్ని అనుమతులు మంజూరు చేసినా నష్ట భర్తీ నిధి చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుపై నిర్ణయం ఏపీ ప్రభుత్వా నిదేనని సమాధానమిచ్చింది. అయినా జగన ప్రభుత్వం కనీసం ప్రయత్నించ లేదు. దీంతో ప్రాజెక్టుపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెల కొంది. కూటమి ప్రభు త్వం మళ్లీ ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

నాడు చంద్రబాబు ఏం చేశారు?

ఈ ప్రాజెక్టును సాధ్యమై నంత వేగంగా పట్టా లెక్కించడానికి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చొరవ చూపింది. పనులు ప్రారంభిం చేలా కేంద్రంపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. రూ.32 వేల కోట్ల విలువైన పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు వల్ల కేంద్రం ఇచ్చే ఆర్థిక మద్దతు, రాష్ట్ర ప్రభుత్వం భారీగా లబ్దిపొందనున్నందున రూ.5,615 కోట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) రూపంలో తమకు చెల్లించాలని అప్పట్లో కేంద్రం మెలిక పెట్టింది. అలా అయితేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందని పేర్కొం ది.కానీ రాష్ట్రం విడిపోయి నష్టపోయినందున ఆ మొత్తం తాము భరించలేమని చంద్ర బాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కేంద్రం కొంత మెత్తబడినట్టే కనిపించింది.

Updated Date - Sep 12 , 2025 | 01:05 AM