వస్తామనుకోలేదు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:30 AM
‘వస్తామని ఊహించలేదు... జైల్లోనే మగ్గిపోతామనుకున్నాం.. అక్కడ జైలులో ఉన్న తమిళనాడు ఖైదీలను చూసి భయమేసింది. ఒక్కో జైలులో పాపం ఐదు వేల మంది ఉన్నారు. అందరూ కూడా మాలానే బోటు అదుపు తప్పి.. శ్రీలంక సముద్ర జలాల్లో దారి తప్పిన వారే. వారిలానే తాము కూడా ఉండాల్సి వస్తుం
54 రోజుల పాటు బందీలయ్యాం
సీఎం చంద్రబాబు, ఎంపీ సానా సతీష్, కూటమి ప్రభుత్వ సహకారంతో బతికి బయటపడ్డాం
శ్రీలంక నుంచి కాకినాడకు పయనమైన మత్స్యకారులు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
‘వస్తామని ఊహించలేదు... జైల్లోనే మగ్గిపోతామనుకున్నాం.. అక్కడ జైలులో ఉన్న తమిళనాడు ఖైదీలను చూసి భయమేసింది. ఒక్కో జైలులో పాపం ఐదు వేల మంది ఉన్నారు. అందరూ కూడా మాలానే బోటు అదుపు తప్పి.. శ్రీలంక సముద్ర జలాల్లో దారి తప్పిన వారే. వారిలానే తాము కూడా ఉండాల్సి వస్తుందేమోననే భయం వెంటాడింది. కానీ ఇండియన్ ఎంబ సీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌బాబు ఇతరుల సహకారంతో మేము బతికి బయటపడ్డాం.. కాకినాడ చేరుకోగలుగుతున్నాం’’ ఇదీ శ్రీలంక జైలు నుంచి విముక్తులైన మత్స్యకారుల మనోగతమి ది. శ్రీలంక సముద్రజలాల్లో చిక్కుకుని జాఫ్నా జైలులో సుమారు 54రోజుల పాటు నిర్బంధంలో ఉన్న కాకినాడకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు కాకినాడ బయల్దేరారు. ఈ సందర్భంగా వారు ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’కి పలు విషయాలు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
కాకినాడ జగన్నాథపురానికి చెందిన మత్స్యకారులమైన మేము కె.శ్రీను వెంకటేశ్వర్, కర్రి నూకరాజు బుర్రయ్య, చందా నాగేశ్వరరావు, పంతాడి బ్రహ్మానందం గత నెల ఆగస్టు 3న నాగపట్నం వెళ్లి ఓ పడవ కొనుగోలు చేశారు. ‘‘తిరుగు ప్రయాణంలో చీకటైపోయింది. గాఢాంధకారం.. చుట్టూ చీకటి.. నడిసంద్రంలో దారి తప్పిపోయాం. శ్రీలంక జలాల్లోకి ప్రవేశించాం. రామేశ్వరం వద్ద మూడు కిలోమీటర్లు శ్రీలంక పరిధిలోని సముద్ర జలాల్లోకి పడవ వెళ్లడాన్ని ఆ దేశ నేవీ అధికారులు మమ్మల్ని గుర్తించారు. శ్రీలంక ఫిషరీష్ అధికారుల వద్దకు మమ్మల్ని తీసుకుని వెళ్లారు. వారు మా వివరాలు తెలుసుకుని అన్నీ మాకు అనుకూలంగానే రాసుకున్నా రు. తర్వాత ఇండియన్ ఎంబసీ వచ్చి మా వివరాలు నమోదు చేసుకున్నారు భోజనం పెట్టి బాగా చూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం జాఫ్నా పోలీసులకు అప్పగించారు. ఆగస్టు 4 నుంచి జాఫ్నా జైలులోనే ఉన్నాం. అక్కడ జైలులో ఐదు వేల మంది ఖైదీలు ఉన్నారు. వారి లో తమిళనాడుకు చెందిన వారే ఎక్కువ మంది. జైలులో వసతులు కూడా బాగానే ఉన్నాం.
సుమారు నాలుగుసార్లు కోర్టు వాయిదాలకు వెళ్లాం. చివరికి ఈనెల 12న అక్కడి కోర్టు విడుదలకు జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే శ్రీలంక నేవీ, కోస్ట్‌గార్డు అధికారులు ఆదేశించినా అప్పగింత ఆలస్యమైంది. తమిళనాడు ఖైదీలు జైల్లోనే మగ్గిపోతున్నారు. దారి తప్పిన తమిళనాడు మత్స్యకా ర బోట్లు సుమారు 500 వరకు అక్కడే ఉన్నా యి. వాళ్లు జడ్జి మమ్మల్ని వదిలేయడం చూసి ఆశ్చర్యపోయారు.’’ అంటూ కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన మత్స్యకారులు శ్రీలంకలో తాము ఎదుర్కొన అనుభవాలను వివరించారు. ప్రస్తుతం పాండిచ్చేరికి దగ్గరలో ఉన్నా మని, 30వ తేదీ సాయంత్రానికి కాకినాడ చేరుకుంటామన్నారు. ఇక్కడంతా వాతావరణం వ ర్షం, ఉరుములు, మెరుపులతో భయంకరంగా ఉందని, గంట గంటకీ తమ క్షేమ సమాచారం మెసేజ్ కోస్ట్‌గార్డ్‌కు ఇస్తున్నామని, ముందు వెళుతోన్న షిప్‌ను అనుసరిస్తూ వస్తున్నామని కాకినాడకు తిరిగివస్తున్న కాకినాడ జగన్నాథపురం చంద్రిక థియేటర్, మల్లిపూడి వారి వీధికి చెందిన పంతాడి బ్రహ్మానందం, చింతా నాగేశ్వరరావు(భైరవపాలెం, యానాం సావిత్రినగర్, కొప్పాడి శ్రీను ఏటిమొగ, కర్రి నూకరాజు(గంగవరం మం డలం మసకపల్లి) పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు
శ్రీలంక కోర్టు కాకినాడ మత్స్యకారులను విడుదల చేయాలని సెప్టెంబరు 12న ఆదేశించినా అక్కడ కోస్ట్‌గార్డు, నేవీ అధికారులు సకాలంలో స్పందించలేదు. దీంతో బందీలైన మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో వారు విషయాన్ని ఎంపీ సానా సతీష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ దృషి ్టకి తీసుకువెళ్లి మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని కోరడం, ఆయన కోస్ట్‌గార్డ్ కమాండర్ దినేష్‌జేతో చర్చించి విడుదలకు దారి చూపారు. శ్రీలంకలో బందీలైన తమ వారిని స్వ స్థలాలకు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలకు మత్స్యకారుల కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.