Share News

నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 11 , 2025 | 12:36 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి రుద్రరాజు స త్యనారాయణరాజు హెచ్చరించారు. కాకినాడలో జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో శని వారం ఆయన ధరల నియంత్రణ కోసం కిరా ణా మర్చంట్ల అసోసియేషన్‌, బియ్యం వ్యాపా రస్తులు, హోల్‌సేల్‌ రిటైల్‌ వర్తకులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, రైతు బజార్‌ ఎస్టేట్‌ అధి

నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న సత్యనారాయణరాజు

జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి రుద్రరాజు సత్యనారాయణరాజు

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి రుద్రరాజు స త్యనారాయణరాజు హెచ్చరించారు. కాకినాడలో జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో శని వారం ఆయన ధరల నియంత్రణ కోసం కిరా ణా మర్చంట్ల అసోసియేషన్‌, బియ్యం వ్యాపా రస్తులు, హోల్‌సేల్‌ రిటైల్‌ వర్తకులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా రుద్రరాజు సత్యనారాయణరాజు మాట్లా డుతూ నిత్యావసర వస్తువులైనా బియ్యం, పప్పు దినుసులు వంటివి అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచే ప్రయత్నం చేయవద్దన్నారు. జి ల్లాలో ధరల నియంత్రణకు ప్రత్యేకంగా ధరల పర్యవేక్షణ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా లో నిత్యావసర వస్తువులు విక్రయించే ప్రతి దుకాణదారులు ధరల పట్టికను విధిగా ప్రదర్శి ంచాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరలను అదుపులో ఉంచేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులను విక్రయించాలన్నారు. జిల్లాలో వినియోగదారులు ఫిర్యాదు చేస్తే వెం టనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుం టామని తెలిపారు. కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపారస్తులు ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:36 AM