పనులు వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:06 AM
అన్నవరం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తుల అసంతృప్తి శాతం తగ్గించడం, మెరుగైన సౌకర్యాలక కల్పనకు ఏమి చే యాలనేదానిపై ఒకట్రోండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేద్దామని... ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈవో ఇతర ముఖ్య అధికారులు కలెక్టర్ కార్యాలయా
అన్నవరం దేవస్థానంలో సౌకర్యాల మెరుగుకు ప్రత్యేక సమావేశం
కలెక్టర్ కార్యాలయానికి రావాలని అధికారులకు ఆదేశం
సత్యదేవుడిని కుటుంబసభ్యులతో దర్శించిన కాకినాడ జిల్లా కలెక్టర్
అన్నవరం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తుల అసంతృప్తి శాతం తగ్గించడం, మెరుగైన సౌకర్యాలక కల్పనకు ఏమి చే యాలనేదానిపై ఒకట్రోండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేద్దామని... ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈవో ఇతర ముఖ్య అధికారులు కలెక్టర్ కార్యాలయానికి రావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో సత్య దేవుడిని ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఐవీ ఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానం స్థానం నానాటికీ పడిపోతుందని ప్రత్యేక కార్యచరణ రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనం తరం దేవస్థానంలో ప్రసాద్‌స్కీం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాద భవనం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించగా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. భక్తుల కోసం తాత్కాలిక, శాశ్వత మరుగుదొడ్ల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని అన్నదాన భవనం నిర్మా ణం, మరుగుదొడ్ల ఏర్పాటు స్థలం చాలా దూరం కావడంతో మరోపక్క ఈ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ దంపతులకు ఆలయ ఈవో సుబ్బారావు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులువేదాశీర్వచనం అందించారు.