Share News

ఆ నలుగురి అరెస్ట్‌!

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:08 AM

రంగరాయ వైద్యకళాశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.కల్యాణ్‌చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కళాశాలలో బీఎస్సీ-మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈనెల 9వతేదీన ఈ మెయి ల్‌ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారని కలెక్టర్‌ తెలిపారు.

ఆ నలుగురి అరెస్ట్‌!
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

వారిపై చట్టపరమైన చర్యలు

ధైర్యంగా ఫిర్యాదు చేసిన విద్యార్థినులు, స్పందించిన ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌, ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీలకు అభినందనలు

రంగరాయ’ లైంగిక వేధింపుల ఘటనపై వివరాలు వెల్లడించిన కాకినాడ కలెక్టర్‌

ఫిర్యాదు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేశాం : కాకినాడ ఎస్పీ

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

రంగరాయ వైద్యకళాశాలలోని పారామెడికల్‌ విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరంగా, అనుచితంగా మెసేజ్‌లు పె డుతూ వేధిస్తున్న నిందితులు ల్యాబ్‌ అటెండెంట్‌ వాడ్రేవు కల్యాణ్‌ చక్రవర్తి, మైక్రోబయాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ బి.జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఎస్‌.గోపాలకృష్ణ, పేథాలజీ విభాగ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ప్రసాద్‌లపై విచారణ జరిపి వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేయడం తోపాటు అరెస్టు చేసినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడించారు. కాకినాడ రంగరాయలో పారా మెడికల్‌ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు.

విద్యార్థినుల ఆరోపణలు నిజమే

రంగరాయ వైద్యకళాశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.కల్యాణ్‌చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కళాశాలలో బీఎస్సీ-మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న 50 మంది విద్యార్థులు ఈనెల 9వతేదీన ఈ మెయి ల్‌ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారని కలెక్టర్‌ తెలిపారు. దీనిపై ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ వెంటనే స్పందించి ఈ ఫిర్యాదును కళాశాలలోని లైంగిక వేధింపుల నిరోఽధానికి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ విచారణకు అప్పగించారని..ఈ కమిటీ ఈనెల 9, 10 తేదీల్లో బీఎస్సీ-ఎంఎల్‌టీ కోర్సు చదువుతున్న 50మంది విద్యార్థినులు, నిందిత ఉద్యోగులను విచారించి అందరి వాంగ్మూలాలు, సాక్ష్యాలను నమోదు చేసిందన్నారు. ఈ విచారణలో 50 మంది విద్యార్థినులు నిందితుడు వాడ్రేవు కల్యాణ్‌ చక్రవర్తితోపాటు మరో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎస్‌.గోపాల్‌కృష్ణ, బి.జిమ్మిరాజు, జీవీఎస్‌ ప్రసాదరావులు కూడా తమపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టు తెలిపారన్నారు. కమిటీ విచారణలో ఈ నలుగురిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిజమని తేలిందని, ఈ మేరకు నలుగురి నిందితులను రంగరాయ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌ చేసి వారిపై స్థానిక కాకినాడ వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయగా శుక్రవారం వారందరినీ అరెస్టు చేశారని కలెక్టర్‌ వివరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకొచ్చి ఫి ర్యాదు చేసిన విద్యార్థినులను, ఫిర్యాదుపై తక్షణ విచారణ నిర్వహించి, వారిలో వ్యవస్థ పట్ల విశ్వా సాన్ని నింపిన ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌, ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీలను కలెక్టర్‌ అభినందించారు.

శక్తి యాప్‌ను సద్వినియోగం చేసుకోండి : కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎంసీ ఘటనలో పోలీస్‌ స్టేషన్లలో శుక్రవారం ఉదయం ఫిర్యాదు నమో దు కాగా నేరారోపితులు నలుగురినీ మ ధ్యా హ్నం రెండున్నర గంటలలోపు అరెస్టు చేశామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం అరెస్టు చేశామని వెల్లడించారు. బాలికలు, మహిళల రక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా పోలీసుశాఖ శక్తియాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని.. విద్యార్థిను లు, వర్కింగ్‌ ఉమెన్‌ తమపట్ల జరిగే అకృత్యాల నుంచి రక్షణ పొందేందుకు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో రంగరాయ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌, జీజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసన్‌, ఆర్‌ఎంసీ పారామెడికల్‌ కోర్సుల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సతీష్‌ ఉన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 08:55 AM